Begin typing your search above and press return to search.

మాల్డీవ్స్ నుండి సమంత ఏమంటోందంటే..

By:  Tupaki Desk   |   30 Dec 2016 11:30 AM GMT
మాల్డీవ్స్ నుండి సమంత ఏమంటోందంటే..
X
ప్రస్తుతం మాల్డీవ్స్ లో తన హాలిడేస్ ఎంజాయ్ చేస్తోంది హీరోయిన్ సమంత. అక్కడి నుండే తన ఫ్యాన్స్ తో ఓ చిన్న చాట్ మొదలెట్టేసింది. ఈ సందర్భంగా అమ్మడు పెద్దగా ఇంట్రెస్టింగ్ అండ్ న్యూ విషయాలు చెప్పకపోయినా కూడా.. ఈ మధ్యన జరుగుతున్న కరెంట్ అఫైర్స్ పై కామెంట్లు.. తన కొత్త సంవత్సరపు ప్లాన్స్ కొంచెం కొంచెంగా.. అలా రివీల్ చేస్తూ వచ్చింది. అందులో కొన్ని కొత్తగా ఉన్నాయ్ అనుకోండి.

సమంత ఏమని చెప్పిందంటే..

--కొంతమంది ప్రింట్ మీడియా వారికి ఇంటర్యూలు ఇస్తే.. వారు నేను చెప్పింది మార్చేసి రాస్తున్నారు. అది చాలా చిరాకు తెప్పిస్తోంది.

--అసలు ఇంట్లో లవ్ గురించి చెప్పినప్పుడు ఎవ్వరూ అడ్డు చెప్పలేదు.

--హిందీలో ఆలియా భట్ (డియర్ జిందగీ) అండ్ అమీర్ ఖాన్ (దంగల్) కు బెస్ట్ యాక్టర్స్ .. బెస్ట్ యాక్టర్ అవార్డులు రావాలి..

--తెరి సినిమా రిలీజై హిట్టు కొట్టాక.. ఏకంగా నేను 6 అడుగులు పొడవుగా మారిపోయాను.

--ఎటో వెళ్ళిపోయింది మనస్సు డివిడి అడిగేవారు చాలా ఎక్కువైపోయారు. సినిమా రిలీజైనప్పుడు మీరందరూ ఏమైపోయారు?

--ఇకమీదట కాంబినేషన్ల మీద కాకుండా.. కంటెంట్ మీద ఫోకస్ చేస్తా

--2017లో వర్క్ విషయంలో పెద్ద రిస్కే తీసుకుంటున్నా.. ముందుగా ఒక ఫ్రెండ్ తో సినిమా చేస్తున్నా..

మొత్తానికి ఈ సుందరి పాత సంవత్సరంలో ఇండియా నుండి వెళ్ళిపోయి మళ్ళీ కొత్త సంవత్సరమే తిరిగొస్తోంది. ఫెంటాస్టిక్ ఎబ్రాడ్ ట్రిప్ ఎంజాయ్ చేశాక.. మరి ఎంగేజ్మెంట్ పనులై ఫోకస్ పెడతారేమో చూడాలి ఈ సమంత అండ్ చైతన్య జంట.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/