Begin typing your search above and press return to search.
సమంత సెటైర్.. సిద్ధు మీదేనా?
By: Tupaki Desk | 13 May 2016 3:00 PM ISTకెరీర్ మొదలైన రెండేళ్లకే ప్రేమాయణం కూడా మొదలుపెట్టేసింది సమంత. తెలుగు-తమిళ భాషల్లో మంచి పేరున్న సిద్ధార్థ్ తో రెండు మూడేళ్ల పాటు ఆమె ఎఫైర్ నడిపించిన సంగతి తెలిసిందే. ఐతే ఆ ప్రేమాయణం ఎంతో కాలం సాగలేదు. రెండు మూడేళ్లకే ఇద్దరూ విడిపోయారు. ఐతే ఆ ఎఫైర్ గురించి సందర్భం వచ్చినపుడల్లా పరోక్షంగా ఏదో ఒక వ్యాఖ్య చేయడం సమంతకు అలవాటు. మొన్న మదర్స్ డే సందర్భంగా నేనో మంచి కూతుర్ని కాలేకపోయా.. మంచి గర్ల్ ఫ్రెండ్ కూడా కాలేకపోయా అంటూ అసందర్భోచిత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తాజాగా అభిమానులతో ట్విట్టర్ చిట్ చాట్ సందర్భంగా సమంత మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
మీరు మీ జీవితంలో తీసుకున్న నిర్ణయాలపై పశ్చాత్తాపపడిన సందర్భాలేమైనా ఉన్నాయా అని అడిగాడో అభిమాని. దీనికి ఏమాత్రం తడుముకోకుండా ‘‘2012లో తీసుకున్న నిర్ణయాలపై చింతిస్తుంటా’’ అని బదులిచ్చింది సామ్. ఆ ఏడాదే సమంత సిద్ధార్థ్ తో ప్రేమాయణం మొదలుపెట్టింది. అదే ఏడాది అతడితో ‘జబర్దస్త్’ సినిమా కూడా చేసింది. ఆ మరుసటి ఏడాది ఆ సినిమా రిలీజైంది.
సిద్ధుతో ప్రేమలో పడటం.. అతడితో సినిమా చేయడం పట్ల రిగ్రెట్ అవుతున్నానని చెప్పకనే చెప్పేసిందామె. ఐతే సమంత నుంచి విడిపోయాక సిద్ధార్థ్ మాత్రం ఏనాడూ తన గురించి ఒక్క మాట మాట్లాడింది లేదు. బ్రేకప్ గురించి మీడియాలో వార్తలొచ్చినపుడు కూడా సమంత స్పందించిందే తప్ప సిద్ధు సైలెంటుగానే ఉన్నాడు. మరి సమంత ఎందుకు పదే పదే సిద్ధును కెలుకుతూ ఉంటుందో ఏంటో?