Begin typing your search above and press return to search.

బాబాయ్ చేతుల మీదుగా సమంతకు అవార్డ్

By:  Tupaki Desk   |   30 March 2017 7:10 AM GMT
బాబాయ్ చేతుల మీదుగా సమంతకు అవార్డ్
X
టాలీవుడ్ బ్యూటీ సమంత త్వరలో పెళ్లి చేసుకోనుందనే సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్యతో శామ్ కు నిశ్చితార్ధం కూడా ఇప్పటికే జరిగిపోయింది. ఆ తర్వాత ఈ భామకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతలు అప్పగించగా.. ఇప్పుడు ఐఫా ఉత్సవంలో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ కూడా అందుకుంది.

శామ్ కెరీర్ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కాగా.. అఆ చిత్రానికి సమంతకు ఉత్తమ నటి అవార్డు లభించింది. గత రాత్రి ఈ అవార్డును స్యామ్ అందుకోగా.. ఆమెకు స్టార్ ప్రొడ్యూసర్ డి. సురేష్ బాబు ఈ అవార్డును అందించారు. ఈయన ప్రొడ్యూసర్ మాత్రమే కాదు.. సమంతకు బాబాయ్ కూడా. అక్కినేని నాగచైతన్య తల్లి.. నాగార్జున మొదటి భార్య లక్ష్మికి స్వయానా సోదరుడే సురేష్ బాబు. అంటే చైతుకు మేనమామ చేతుల మీదుగా.. సమంతకు ఉత్తమ నటి అవార్డ్ దక్కిందన్న మాట.

అక్కినేని ఫ్యామిలీ.. సురేష్ బాబు కుటుంబం ఇప్పటికీ ఎంతో సన్నిహితంగా సాన్నిహిత్యంగా ఉంటారు. అంతే కాదు.. ఈ అవార్డును సమంత అందుకుంటున్నపుడు.. అక్కినేని నాగార్జున.. అమల.. అఖిల్ లు కూడా అదే వేడుకలో ఉండడం విశేషం. అటు మామగారింటి బంధువులు.. అటు అత్తగారింటి బంధువుల మధ్యలో.. అది కూడా బాబాయ్ వరుసయ్యే వ్యక్తి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం అంటే.. అది సమంతకు సంథింగ్ స్పెషల్ అనాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/