Begin typing your search above and press return to search.
రకుల్ కి మద్ధతుగా నిలిచిన సామ్...!
By: Tupaki Desk | 13 Sep 2020 4:00 PM GMTసినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ రియా చక్రవర్తి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణలో డ్రగ్స్ తో సంబంధం ఉన్న 25 మంది సినీ ప్రముఖుల పేర్లను బయటపెట్టినట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ మరియు సారా అలీఖాన్ ల పేర్లు ప్రధానంగా ఉన్నట్లు గత రెండు రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే డ్రగ్స్ వ్యవహారంలో రియా చక్రవర్తి పలువురు సినీ ప్రముఖుల పేర్లు చెప్పిందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తాజాగా ఎన్సీబీ అధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది.
కాగా, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా ఓ వెబ్ మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రియా చక్రవర్తి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏ బాలీవుడ్ స్టార్ పేరు వెల్లడించలేదని.. కేవలం డ్రగ్స్ పెడ్లర్లు మరియు స్మగ్లర్ల పేర్లు మాత్రమే చెప్పిందని ఆయన వెల్లడించారు. డ్రగ్స్ కేసులో 25 మంది బాలీవుడ్ స్టార్లు పేర్లు బయటకు వచ్చాయని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని కేపీఎస్ మల్హోత్రా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ - సారా అలీ ఖాన్ పేర్లు ఈ జాబితాలో లేవని.. బాలీవుడ్ సెలబ్రిటీలెవ్వరికి కూడా సమన్లు జారీ చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో అనవసరంగా డ్రగ్స్ ఇష్యూలోకి రకుల్ పేరు తీసుకొచ్చారని పేర్కొంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా 'సారీ రకుల్' అంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. దీనికి స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత రకుల్ ప్రీత్ సింగ్ కు మద్ధతుగా నిలుస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్టులు పెట్టింది. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ - సారా అలీ ఖాన్ పేర్లు లేవనే న్యూస్ ని స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టా స్టోరీలో యాడ్ చేసిన సామ్ 'సారీ రకుల్' 'సారీ సారా' అని ట్యాగ్స్ పెట్టింది.