Begin typing your search above and press return to search.

'భర్త కాదు.. మాజీ భర్త'.. కరణ్ షోలో సమంత కామెంట్స్..!

By:  Tupaki Desk   |   21 July 2022 4:56 PM GMT
భర్త కాదు.. మాజీ భర్త.. కరణ్ షోలో సమంత కామెంట్స్..!
X
గత కొంతకాలంగా అక్కినేని నాగచైతన్య - సమంత రూత్ ప్రభు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఎందుకనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది వరకూ అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని కొనసాగించిన వీరిద్దరూ.. ఉన్నట్టుండి విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోడానికి కారణాలేంటనేది తెలియనప్పటికీ.. చై-సామ్ వ్యవహారం పై అనేక ఊహాగానాలు వచ్చాయి

ఇప్పటికే విడాకుల ప్రకటన పై నాగచైతన్య - సమంత ఇద్దరూ స్పందించారు. చైతూ ఈ విషయంపై మళ్లీ మాట్లాడటానికి సిద్ధంగా లేదని 'థాంక్యూ' ప్రమోషన్స్ లో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలను అవైడ్ చేయడాన్ని బట్టి అర్థం అవుతుంది. అయితే సామ్ గురించి తెలిసినవాళ్ళు మాత్రం కచ్చితంగా ఆమె ఈ ఇష్యూ మీద సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతుందని భావించారు.

అందులోనూ ఇటీవలే ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' లో సమంత పాల్గొనడంతో.. ఎన్నో సంచలనాలు తెర లేపుతుందని అందరూ అనుకున్నారు. ప్రోమోని బట్టి తన పర్సనల్ విషయాల గురించి అగ్ర కథానాయిక చర్చించలేదని అభిప్రాయ పడ్డారు. కానీ ఇప్పుడు ఫుల్ ఎపిసోడ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన తర్వాత.. ముందుగా ఊహించిన విధంగానే, ఇతర షోలలో వెల్లడించని విషయాలను కరణ్ షోలో మాట్లాడింది సామ్.

నాగ చైతన్య పేరు తీసుకురాకుండానే 'కాఫీ విత్ కరణ్' 7వ సీజన్ మూడవ ఎపిసోడ్ లో సమంత తన విడాకుల గురించి మరియు విడిపోయిన తర్వాత జీవితం గురించి సమాధానమిచ్చింది. 'నువ్వు నీ హస్బెండ్ విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత..' అని కరణ్ జోహార్ అడుగుతుండగా.. సామ్ మధ్యలో కలుగజేసుకొని 'ఎక్స్ హస్బెండ్' అని సూచించింది.

ఆ సందర్భంలో సమంత దగ్గినట్లు గొంతు సవరించుకోవడాన్ని గమనించవచ్చు. దీంతో కరణ్ సారీ చెబుతూ ప్రశ్నను కంటిన్యూ చేశారు. సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు ఎక్కువగా ఉంచారు? దాని వల్లే మీపై ఎక్కువ ట్రోలింగ్ జరిగిందని అనుకుంటున్నావా? అని ఆమెను అడిగాడు.

ప్రేక్షకులు ఎల్లప్పుడూ తన జీవితంలో భాగమే కాబట్టి.. తాను పబ్లిక్ డొమైన్ లో ఆ విషయాన్ని ఉంచానని సామ్ బదులిచ్చింది. పారదర్శకంగా ఉండాలని ఆ మార్గాన్ని ఎంచుకున్నానని తెలిపింది. వాళ్ళు నా జీవితంలో చాలా ఇన్వెస్ట్ చేశారు కాబట్టి, నేను వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉందని ఆ టైంలో నాకు అనిపించింది. అందుకే నా లైఫ్ గురించి చాలా విషయాలు వాళ్ళకి వెల్లడించాను అని సమంత చెప్పింది. నేను దాన్నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు నేను ఓకే. బెటర్ థెన్ ఓకే అని సమంత తెలిపింది.

విడాకుల తర్వాత జీవితం ఎలా ఉంది? అని కరణ్ ప్రశ్నించగా.. ''జీవితం చాలా కష్టంగా ఉంది.. కానీ ఇప్పుడు బాగుంది. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. నేను గతంలో కంటే చాలా బలంగా ఉన్నాను" అని సమంత బదులిచ్చింది. ఈ సందర్భంగా నటుడు మాథ్యూ మెక్‌కోనాగ్ లైన్‌ ను ఉటంకిస్తూ, "లైఫ్ లో నేను అన్ని సమయాలలో A లను స్కోర్ చేయలేరు.. బదులుగా అజ్ఞాని A కంటే అనుభవజ్ఞుడైన C ని తీసుకోండి" అని చెప్పింది.

కఠినమైన అనుభూతుల గురించి కరణ్ జోహార్ ప్రశ్నించినప్పుడు.. “మనం పదునైన వస్తువులను దాచే గదిలో ఇద్దరినీ ఉంచినట్లయితే ఎలా ఉంటుందో.. ప్రస్తుతం నేను ఆ జోన్‌ లో ఉన్నాను” అని సంధానమిచ్చింది. ఇప్పుడు తమ మధ్య పరిస్థితులు సజావుగా లేకపోయినా.. భవిష్యత్తులో ఈక్వేషన్‌లు అనుకూలించవచ్చని సమంత పేర్కొంది.