Begin typing your search above and press return to search.
యంగ్ హీరోని కడిగేసిన సమంత!
By: Tupaki Desk | 20 Feb 2022 1:07 PM GMTసమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. బాధ అయినా..సంతోషం అయినా ఇన్ స్టా వేదికగా అభిమానులతో షేర్ చేసుకోవడం ఓ హాబీ. నాగచైతన్యతో విడాకుల సమయంలో సామ్ పై నెగివిటీ స్ర్పెడ్ అయినా వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ముందుకెళ్లిపోయిది.
నా పని నాది..మీ పని మీది అన్న చందంగా దూసుకుపోయింది. ఇక ఇండస్ర్టీలో తన స్నేహితుల పోస్ట్ లపైనా తనదైన శైలిలో కామెంట్ చేయడం సామ్ ప్రత్యేకత. తాజాగా సామ్ యంగ్ హీరో తేజ సజ్జ ఫోటోలపై తన మార్క్ కామెంట్ తో ఆకట్టుకుంది సమంత. ఇటీవలే తేజ తన కొత్త ఫోటో షట్ కి చెందిన రెండు ఫోటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసాడు.
వాటికి `ఎక్స్ క్యూజ్ మీ లేడీస్` అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఆ ఫోటలకి డైరెక్టర్ నందిని రెడ్డిని ట్యాగ్ చేసాడు. ఆ పోస్ట్ చూసిన సమంత అంటే? `ఒక్క చిత్రం కోసం ఆహ్..అంత ఈజీ అనుకున్నావా? మనం అతనికి ఏమీ నేర్పించలేదా?`` అంటూ సరదాగా నందిని రెడ్డి మీద సీరియస్ అయింది.
ఈ దెబ్బకి ఇప్పుడు ``మీరు నా మొత్తం స్వాగ్ ని నాశనం చేసారని`` తేజ ఫన్నీగా ఫీలవుతూ కామెంట్ చేసాడు. ఈ రెండు కామెంట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. సమంత చేసిన కామెంట్ తేజకి బూస్టింగ్ లా పనికొస్తుంది.
యంగ్ హీరో ఇప్పుడే కెరీర్ ప్రారంభించాడు. బాల నటుడిగా చాలా చిత్రాల్లో నటించి హీరోగా ప్రమోట్ అయ్యాడు. `ఓ బేబి` చిత్రంలో సమంతో కలిసి తెరను పంచుకున్నాడు. ఆ సాన్నిహిత్యం కారణంగానే ఇద్దరి మధ్య సరదా కామెంట్ల సంభాషణ సాగింది. ప్రస్తుతం తేజ టాలీవుడ్ లో కెరీర్ ని బిల్డ్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే `ఇష్క్`..`అద్భుతం` అనే రెండు చిత్రాల్లో హీరోగా నటించాడు.
ప్రస్తుతం `హను మాన్` చిత్రంలో నటిస్తున్నాడు. ఇక సమంత బిజీ షెడ్యూల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే `శాకుంతలం` షూటింగ్ పూర్తిచేసింది. అలాగే మరో లేడీ ఓరియేంటెడ్ చిత్రం `యశోద` చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లింది. ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది.
తెలుగు..తమిళ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కన్నడ..మలయాళ..హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. అలాగే కోలీవుడ్ లో విజయ్ సేతుపతి సరసన `కథువకుల రెండు కాదల్` అనే సినిమాలోనూ నటిస్తోంది. `అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్` అనే విదేశీ చిత్రంలోనూ నటిస్తుంది. పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లకు సంబంధించి బిజీ అయింది.