Begin typing your search above and press return to search.
# కరోనా: ఆయన కోసం వంటావిడగా మారింది!
By: Tupaki Desk | 28 March 2020 4:08 AM GMTకరోనా కల్లోలం బోలెడన్ని పాఠాలు నేర్పిస్తోంది. ఇందులో నీతి పాఠాలెన్నో. అవేంటో పరిశీలిస్తే.. ముఖ్యంగా ఎవరి పనులు వాళ్లు చేసుకోవాలి! అన్నది తొలి పాఠం. ఇక ఎవరి శుభ్రం వాళ్లే చూస్కోవాలి. ఎవరి వంట వాళ్లు చేసుకుని తినాలి అనే విషయాన్ని బాగా అలవాటు చేస్తోంది. ఇల్లు ఒళ్లు వాకిలి శుభ్రంగా ఉంచుకోవాలని కూడా పాఠం నేర్పింది. ప్రస్తుతం స్వీయ నిర్భంధంలో ఉన్న సెలబ్రిటీలంతా ఈ పాఠాల్ని తూ.చ తప్పక అనుసరిస్తున్నారు.
ఇకపోతే అక్కినేని కోడలు సమంత ఏం చేస్తోందో తెలుసా? ఇన్నాళ్లు కెరీర్ బిజీలో వంటవాళ్లు వండి పెట్టినది తినడమే అలవాటుగా మారింది. అయితే ఇప్పుడు తనకు కావాల్సినంత సమయం దొరికింది. అందుకే తాను వండుకోవడమే గాక హబ్బీ నాగచైతన్య కోసం మంచి రుచికరమైన వంటకాలు చేసి పెడుతోందట. ఈ విషయాన్ని సామ్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. `లంచ్ ప్రిపరేషన్` అంటూ ఓ ఫోటోని షేర్ చేసి దానికి ఇలా సామ్ క్యాప్షన్ ఇచ్చింది. కోవిడ్ -19 లాక్ డౌన్ సమయంలో నాగ చైతన్య కోసం వంట చేసే సమంతా తనలోని చెఫ్ ను బయటకు తీసిందిట. ఇంతకుముందు స్వీయ నిర్భంధానికి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేసిన సమంత .. తన పెంపుడు కుక్క హాష్ అక్కినేనితో తన భర్త ఆటలాడుకుంటున్న ఫోటోని కూడా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా దావానలంలా వ్యాపించడంతో ప్రజలు.. సెలబ్రిటీలు ఇంట్లోనే ఉండి సామాజిక దూరాన్ని అనుసరిస్తున్నారు. కావాల్సినంత తీరిక సమయం చిక్కింది కాబట్టి చాలా మంది సెలబ్రిటీలు తమ దిగ్బంధన కాలాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. మునుపెన్నడూ లేనంతగా కుటుంబం కోసం చాలా సమయాన్ని వెచ్చిస్తున్నారు.
సమంత నటించిన హిందీ వెబ్ సిరీస్ ది `ఫ్యామిలీ మ్యాన్ 2` ఎప్పుడు టెలీకాస్ట్ కాబోతోందా? అన్న ఆసక్తి ఇప్పటికే నెలకొంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ హర్రర్ థ్రిల్లర్ లోనూ సామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న `లవ్ స్టోరీ`లో నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పరశురాం తో సినిమా ఉంటుందా లేదా అన్నది తనే ప్రకటించాల్సి ఉంటుంది.