Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అమ్మ చంక‌నెక్కిన క్యూటీ ఎవ‌రు?

By:  Tupaki Desk   |   26 Jun 2020 4:30 AM GMT
ఫోటో స్టోరి: అమ్మ చంక‌నెక్కిన క్యూటీ ఎవ‌రు?
X
స‌మంత రూత్ ప్ర‌భు.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. టాలీవుడ్ లో ద‌శాబ్ధం పాటు క‌‌థానాయిక‌గా రాణించిన సామ్ ఇటీవ‌ల‌ నాయికా ప్ర‌ధాన చిత్రాల్లో న‌టిస్తూ ఆక‌ట్టుకుంటోంది. అక్కినేని కోడ‌లు అయ్యాక త‌న రూటే స‌ప‌రేట్‌! అంటూ దూసుకుపోతోంది. ఓవైపు హ‌బ్బీ నాగ‌చైత‌న్య కెరీర్ కి సాయ‌మ‌వుతూనే త‌న కెరీర్ ని నిర్మించుకుంటున్న ట్యాలెంటెడ్ కోడ‌లుగా గుర్తింపు తెచ్చుకుంది. సామ్ ఎంద‌రో న‌టీమ‌ణుల‌కు స్ఫూర్తిగా నిలుస్తోందంటే అతిశ‌యోక్తి కాదు.

తాజాగా సమంత తన చిన్ననాటి ఫొటోను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది. ఇందులో సో క్యూట్ సామ్ అమ్మ చంక‌నెక్కి ఎంతో ల‌వ్ లీగా క‌నిపిస్తోంది. త‌న‌తో పాటే కుటుంబ స‌భ్యులు ఉన్నారు. ఇద్ద‌రు చిన్నారి బాల‌కులు ఆ ఫోటోలో క‌నిపిస్తున్నారు. వారినుద్ధేశించి సామ్ కాస్త ఎమోష‌న‌ల్ పోస్ట్ నే పెట్టింది.

``మనం వేర్వేరు మార్గాల్లో పెరిగి పెద్దవాళ్ల‌మ‌య్యాం. కానీ మన మూలాలు మాత్రం ఒకటే. మీ అంద‌రినీ మిస్సవుతున్నా`` అంటూ ఎమోష‌న‌ల్ అయ్యింది సామ్. 5ల‌క్ష‌ల లైక్ లు ద‌క్కించుకుంది ఈ ఫోటో ఇప్ప‌టికే. సామ్ ప్ర‌స్తుతం కోలీవుడ్- టాలీవుడ్ లో బిజీ స్టార్. గేమ్ ఓవ‌ర్ డైరెక్ట‌ర్ వినిపించిన లేడీ ఓరియెంటెడ్ స‌బ్జెక్ట్ కి ఓకే చెప్పిన స‌మంత త్వ‌ర‌లో బాలీవుడ్ లోనూ అడుగు పెట్ట‌నుంద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో నటించింది. న‌య‌న‌తార‌తో క‌లిసి ఓ సినిమా చేస్తోంది.