Begin typing your search above and press return to search.
డ్యాన్స్ మాస్టర్ సమంత ఒళ్లు హూనం చేశాడా?
By: Tupaki Desk | 6 Jan 2022 10:42 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం `పుష్ప ది రైజ్`. బన్నీ కెరీర్‌లోనే అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. బన్నీ గంధపు చెక్కల స్మగ్లర్‌గా ఊర మాస్ పాత్రలో నటించిన ఈ మూవీ రిలీజ్ రోజు కొంత డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్నా ఆ తరువాత మంచి వసూళ్లని రాబడుతూ సూపర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఉత్తరాదిలో ప్రచారం చేయకపోయినా అక్కడ 70 కోట్ల మార్కుని దాటడం షాక్ కు గురిచేస్తున్న విషయం తెలిసిందే.
బన్నీని పాన్ ఇండియా గా మార్చిన ఈ మూవీ రానున్న రోజుల్లో మరిన్ని రాకార్డులు అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 7న ఓటీటీ లో తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్ లకు సంబంధించిన ప్రింట్ ని విడుదల చేస్తున్నారు. సౌత్ ఇండియన్ భాషలకు కలిపి 22 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోవడం రికార్డుగా చెబుతున్నారు. ఇదిలా వుంటే ఈ సినిమాలో సమంత `ఊ.. అంటవా మావ..` అంటూ హాట్ ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే.
సామ్ తొలిసారి చేసిన ప్రత్యేక గీతం కావడంతో ఈ పాటకు యమ క్రేజ్ ఏర్పడింది. `పుష్ప` సినిమాకు వన్ ఆఫ్ ది ఎస్సెట్ గా ఈ పాట నిలిచింది. చంద్రబోస్ అందించిన సాహిత్యానికి దేవి శ్రీప్రసాద్ మాస్ బీట్ ని అందించాడు. మత్తెక్కించే పదాలతో సాగే ఈ పాటని మంగ్లీ సిస్టర్ ఇంద్రావతి చౌహాన్ తనదైన గళంతో మరింత హీటెక్కించింది. ఇక డ్యాన్స్ మాస్టర్ భాను పదాలకు తగ్గట్టే స్టెప్పుల్ని కంపోజ్ చేసి పాటకు మరింత వన్నె తీసుకొచ్చాడు.
అయితే ఈ పాట కోసం సామ్ చాలా శ్రమించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. సిట్టింగ్ స్టెప్, అలాగే బన్నీపై కూర్చుని చేసే హుక్ స్టెప్ కోసం సమంత చమటోడ్చాల్సి వచ్చింది. అంతే కాకుండా స్టెప్స్ విషయంలో డ్యాన్స్ మాస్టర్ భాను ఎక్కడా కాంప్రమైజ్ కాలేదంట. పాన్ ఇండియా మూవీ కావడం, అంతే కాకుండా `రంగస్థలం`లోని `రంగమ్మా.. మంగమ్మా.. పాట మిస్సయి ఈ పాట తనని వెతుక్కుంటూ రావడంతో ఎక్కడా తగ్గేదిలే అన్నట్టుగా స్టెప్స్ విషయంలో ఎక్కడా రాజీపడలేదట.
దాంతో సమంత చమటోడ్చక తప్పలేదని వీడియోని చూస్తే తెలిసిపోతోంది. అంతే కాకుండా స్టెప్స్ విషయంలో డ్యాన్స్ మాస్టర్ తనని టార్చర్ చేశాడని, నన్ను చంపేశాడని సామ్ వీడియోలో చెప్పడం విశేషం. దీన్ని బట్టే సామ్ `ఊ .. అంటావ మావ..` కోసం ఎంత శ్రమించిందో అర్థం చేసుకోవచ్చు. ఒక విధంగా ఈ పాట స్టెప్స్ కోసం సామ్ ఒళ్లు హూనం చేసుకున్నంత పని అయిందంట. అందుకే ఈ పాట స్క్రీన్ పై అంత బాగా వచ్చిందని టీమ్ వర్గాలు అంటున్నాయి.