Begin typing your search above and press return to search.

విడాకుల ప్రకటన డిలీట్ చేసి కొత్త చర్చకు తెర లేపిన సమంత..!

By:  Tupaki Desk   |   22 Jan 2022 6:37 AM
విడాకుల ప్రకటన డిలీట్ చేసి కొత్త చర్చకు తెర లేపిన సమంత..!
X

అక్కినేని నాగచైతన్య - సమంత జంట దశాబ్ద కాలం నాటి ప్రేమ, నాలుగేళ్ల వివాహబంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్‌ లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన స్టార్ కపుల్.. అప్పటి నుంచి విడివిడిగా జీవితాన్ని గడుపుతున్నారు.

చై-సామ్ విడాకుల ప్రకటన చేసి సుమారు నాలుగు నెలలు అవుతోంది. అయితే సమంత తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి చైతన్య నుండి విడిపోతున్నట్లు పేర్కొన్న పోస్ట్‌ ను తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఇది అభిమానులకు ఆనందంతోపాటు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఎందుకంటే టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ సెలబ్రిటీ కపుల్ గా పేరు తెచ్చుకొన్న చై-సామ్ విడిపోవడం అందరినీ షాక్ గురి చేసింది. వీరిద్దరూ మళ్లీ కలిస్తే బాగుంటుందని కోరుకునే ఫ్యాన్స్ ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడు సమంత డివోర్స్ పోస్ట్ ను డిలీట్ చేయడంతో.. ఈ జంట మళ్లీ ఒక్కటవుతుందనే కొత్త పుకార్లు పుట్టుకొచ్చాయి.

విడాకుల ప్రకటన తర్వాత సామ్ తన సోషల్ మీడియా ఖాతాల నుంచి నాగచైతన్య ఫొటోలను తొలగించింది. అలానే పలు ఇంటర్వ్యూలలో తన క్లిష్ట పరిస్థితుల గురించి బయటపెట్టింది. మరోవైపు చైతన్య కూడా ఇటీవల సమంతతో విడిపోవడంపై స్పందించారు.

అది ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయమని.. ఆమె సంతోషంగా ఉందని.. తాను కూడా సంతోషంగా ఉన్నానని చై అన్నారు. ఈ పరిస్థితులుల్లో ఇద్దరికీ బెస్ట్ డెసిషన్ ఇదే అనుకున్నామని పేర్కొన్నారు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి సమంత విడాకుల పోస్ట్‌ ని ఎందుకు డిలీట్ చేసిందో?

ఇక సినిమాల విషయానికొస్తే సమంత - చైతన్య వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. 'బంగార్రాజు' 'లవ్ స్టోరీ' వంటి రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో చైతూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పటికే 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ కంప్లీట్ చేసిన అక్కినేని యువసామ్రాట్.. ప్రస్తుతం 'థ్యాంక్యూ' సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే చైతన్య ఓ వెబ్ సిరీస్ చేయనున్నాడు.

మరోవైపు సమంత కూడా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా వుంది. 'శాకుంతలం' 'కాతు వాకుల రెండు కాదల్' సినిమాలను పూర్తి చేసి.. ప్రస్తుతం 'యశోద' చిత్రీకరణలో పాల్గొంటోంది. ఇదే క్రమంలో 'అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్' అనే హాలీవుడ్ మూవీలో సామ్ కీలకపాత్ర పోషించనుంది.