Begin typing your search above and press return to search.
విజయ్ దేవరకొండతో సమంత డైరెక్టర్స్!
By: Tupaki Desk | 10 Sep 2022 12:34 PM GMT'లైగర్'తో భారీ డిజాస్టర్ ని సొంతం చేసుకున్నాడు రైడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఈ మూవీతో పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ ని దక్కించుకుని బాలీవుడ్ లో జెండా పాతేయాలని చేసిన విజయ్ ప్లాన్ ఆదిలోనే ఆవిరైపోయింది. అయితే తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా క్రేజీ ప్రాజెక్ట్ కుదిరినట్టుగా తెలిసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న 'ఖుషీ' మూవీలో నటిస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
దీనితో పాటు పూరి డైరెక్షన్ లో 'జనగణమన'ని ఇటీవలే మొదలు పెట్టారు. అయితే 'లైగర్' ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ ని అర్థాంతరంగా నిలిపివేశారనే వార్తలు వినిపించిన నేపథ్యంలో 'ఖుషీ' తరువాత విజయ్ దేవరకొండ సినిమా ఏంటీ? ఎవరితో అనే చర్చ మొదలైంది. దిల్ రాజు కాంపౌండ్ లో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నాడని, దిల్ రాజు చాలా కాలంగా ఈ ప్రాజెక్ట్ కోసం కొంత మందితో కథని కూడా సిద్ధం చేయిస్తున్నాడని వినిపించింది.
అయితే దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు. తాజాగా విజయ్ దేవరకొండ 'ఖుషీ' మూవీ తరువాత భారీ ప్రాజెక్ట్ ని సమంత డైరెక్టర్లతో చేయబోతున్నాడట. 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ తో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ నిడిమోరు అండ్ కృష్ణ దాసరి కొత్తపల్లి ఆ తరువాత సమంతతో 'ఫ్యామిలీ మ్యాన్ 2'ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నారు.
వైజయంతీ మూవీస్ అథినేత సి. అశ్వనీదత్ నిర్మాత. గతంలో ఇదే బ్యానర్ లో విజయ్ దేవరకొండ ..హీరో నానితో 'ఎవడే సుబ్రమణ్యం', కీర్తి సురేష్ నటించిన 'మహానటి' చిత్రాల్లో నటించాడు. ఈ సినిమాల తరువాత వజియ్ దేవరకొండతో అశ్వనీదత్ ఓ భారీ సినిమా చేయాలనుకున్నాడట. దీనికి సంబంధించిన అడ్రిమెంట్ ఎప్పుడో జరిగినా సరైన కథ కుదరకపోవడంతో ఇప్పటికి వీరి కలయికలో ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదట.
అయితే ఇటీవల రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం విజయ్ దేవరకొండకు ఓ టెర్రిఫిక్ స్టోరీని వినిపించారట. విజయ్ దేవరకొండకు నచ్చడంతో ఆ కథ అశ్వనీదత్ వద్దకు వెళ్లిందని, ఆయనకు కూడా నచ్చిందని తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలిసింది. తెలుగువారైన ఈ దర్శకులు తెలుగులో సినిమా చేయాలని గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇంత వరకు కార్యరూపం దాల్చడం లేదు. మహేష్ తో చేయాలని ప్రయత్నాలు చేశారు కానీ అది మెటీరిలైజ్ కాలేదు. విజయ్ దేవరకొండతో ఇప్పుడు వీరి సినిమా ఖరారు అయిందని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.