Begin typing your search above and press return to search.

ఎంట్రీకంటే ముందే స‌మంత విక్స్ తో మ‌టుమాయం!

By:  Tupaki Desk   |   19 July 2022 7:30 AM GMT
ఎంట్రీకంటే ముందే స‌మంత విక్స్ తో మ‌టుమాయం!
X
స‌మంత టాలీవుడ్ కెరీర్ ప్రారంభ‌మై ద‌శాబ్ధం దాటినా తెలుగు భాష‌పై మాత్రం పూర్తి స్థాయిలో ఇంత‌ర‌కూ ప‌ట్టు సాధించ‌లేదు. స్వ‌చ్ఛ‌మైన తెలుగును మాట్లాడ‌టం ఇప్ప‌టికీ స‌రిగ్గా రాదు. త‌న‌క‌న్నా వెనుకొచ్చిన హీరోయిన్లు ఎంతో మంది తెలుగు ఎంతో చ‌క్క‌గా మాట్లాడుతారు. కానీ సామ్ మాత్రం భాష‌పై ఇంత వ‌ర‌కూ శ్ర‌ద్ద పెట్ట‌లేదు.

స‌మంత‌కి డ‌బ్బిగ్ చెప్ప‌డంలో చిన్మ‌యి స‌హాకారం అనేది ఎప్ప‌టికీ మ‌రువ‌లేనిది. స‌మంత ఎక్స్ ప్రెష‌న్స్ కి..ప‌ర్పెక్ట్ గా చిన్మ‌యి వాయిస్ సింక్ అవుతుంది. అలా టాలీవుడ్ లో కొంత కాలం నెట్టుకొచ్చేసింది. దాదాపు స‌మంత న‌టించిన చాలా సినిమాల‌కు చిన్మ‌యి డ‌బ్బింగ్ చెప్పింది. ఆ త‌ర్వాత 'మ‌జిలి' సినిమాకి మాత్రం సామ్ సొంత గాత్రాన్ని అందించింది.

కొంత వ‌ర‌కూ అందులో సామ్ వాయిస్ బాగానే వ‌ర్ కౌట్ అయింది. ఇక స‌మంత తెలుగు భాష‌ని నేర్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు. బాలీవుడ్ లోనే కెరీర్ ని ప్లాన్ చేసుకుంటుంది కాబ‌ట్టి అక్క‌డ ఎంట్రీకి ముందే హిందీ భాష‌పై ప‌ట్టు సాధించే ప‌నిలో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. 'ఫ్యామిలీ మ్యాన్ -2' సిరీస్ తో ఫేమ‌స్ అయిన అమ్మ‌డు అటుపై పుష్ప తో మ‌రింత గుర్తింపు ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు సామ్ కి హిందీ అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. అయితే అంత‌క‌న్నా ముందే అమ్మ‌డు హిందీలో క‌మ‌ర్శియ‌ల్ యాడ్స్ తో దూసుకుపోతున్న‌ట్లు క‌నిపిస్తుంది. బాలీవుడ్ న‌టుడు ర‌ణ‌వీర్ సింగ్ తో కలిసి విక్స్ వ్యాప‌ర‌బ్ యాడ్ లో న‌టించింది. దానికి సంబంధించిన యాడ్ ఇప్పుడు ట్విట‌ర్లో వైర‌ల్ అవుతోంది. ఓ సారి ఆయాడ్ చూస్తే...

ఇందులో స‌మంత ట్రాపిక్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టించింది. ర‌ణ‌వీర్ ట్రాపిక్ రూల్స్ అతిక్ర‌మించే బైక‌ర్ గా న‌టించాడు. త‌ల‌నొప్పి..ముక్కు దిబ్బ‌డ‌తో బాధ‌ప‌డుతోన్న ర‌ణ‌వీర్ బైక్ పై వ‌స్తూ ట్రాఫిక్ సిగ్నెల్ క్రాస్ చేస్తాడు. దీంతో డ్యూటీలో ఉన్న స‌మంత ర‌ణ‌వీర్ ని అడ్డుకుంటుంది. త‌న‌కున్న ముక్కుదిబ్బ‌డ‌..త‌ల‌నొప్పి కార‌ణంగా సిగ్నెల్ చ‌సుకోలేద‌ని అంటాడు ర‌ణ‌వీర్.

వెంట‌నే స‌మంత విక్స్ తీసిచ్చి ఉప‌శ‌మ‌నం పొంద‌మంటుంది. అయితే ఈ యాడ్ కోసం స‌మంత నే స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పింది. హిందీ చాలా చ‌క్క‌గా మాట్లాడింది. స‌మంత త‌మిళ బ్యూటీ అయినా హిందీని చాలా ప్లూయెంట్ గా మాట్లాడింది. దీంతో స‌మంత‌కి హిందీలో డ‌బ్బింగ్ కోసం ఇత‌ర ఆర్టిస్టుల‌పై ఆధార‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని యాడ్ నిరూపిస్తుంది.