Begin typing your search above and press return to search.

సమంత ఎమోషనల్ మజిలీ

By:  Tupaki Desk   |   7 April 2019 3:45 PM GMT
సమంత ఎమోషనల్ మజిలీ
X
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే వచ్చింది.. అంటూ అక్కినేని కాంపౌండ్ సంబరాలు చేసుకుంటోంది. దాదాపు రెండేళ్ల తర్వాత ఇదీ పరిపూర్ణ విజయం అంటే అని చెప్పుకుంటూ సక్సెస్ సెలబ్రేషన్ లో డీప్ గా మునిగిపోయారు. మొదటి రోజే క్రిటిక్స్ అంతా యునానిమస్ గా `మజిలీ` బావుంది అని పొగిడేశారు. థియేటర్లలో జనం నుంచి అలాంటి స్పందన వచ్చింది. దీంతో మజిలీ సూపర్ హిట్ అని అక్కినేని చైతన్య, సమంత జోడీ డిక్లేర్ అయిపోయారు. హిట్టొచ్చిన వేళ ఆ సంతోషాన్ని మీడియా ముఖంగా అభిమానులతో పంచుకునేందుకు నేడు హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో విజయోత్సవ వేడుకను నిర్వహించారు.

ఈ విజయం మాకు ఎంత అవసరమో మీకందరికీ తెలుసు.. అంటూ సామ్ చేసిన ప్రసంగం ఎంతో ఎమోషనల్ గా సాగింది. తొలిరోజు ప్రీమియర్ వేస్తున్నప్పుడు తాను అనుభవించిన టెన్షన్ ని మాటల్లో వర్ణించలేనని సమంత జీరవోయిన గొంతుతో చెప్పారు. ఆరోజు ప్రతి నిమిషం అనుభవించిన టెన్షన్ ని సామ్ ఇంచి ఇంచి వర్ణించారు. 2గం.లకు మొదలైన టెన్షన్ 3గం.లకు.. 4గం.లకు అంటూ ప్రతి గంటను వర్ణించారు. థియేటర్ వరండాలో అటూ ఇటూ తిరిగేస్తూ అసలేం జరుగుతోందోననే భయపడ్డానని సామ్ అన్నారు. సినిమా బావుంది అన్న మాట రాగానే అర్థగంట సేపు ఏడ్చేశానని సామ్ చెప్పడం తనలోని ఉద్వేగాన్ని తెలియజెప్పింది. చైతూకి ఏమని చెప్పాలి? అని టెన్షన్ పడ్డానని సామ్ చెప్పారంటే ఈ చిత్రాన్ని ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారో ఈ జోడీ అర్థం చేసుకోవచ్చు. సక్సెస్ ఆనందం సమంతలో స్పష్ఠంగా కనిపించింది.

సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యిందంటనే నమ్మలేకపోతున్నాను. ఇంత రెస్పాన్స్ ఇంత బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకోలేదు. ఒక మంచి రిజల్ట్ ఆర్టిస్టుకి ఎంత ముఖ్యమో నాకు తెల్సు. సినిమా చూసి నాగ్ మామ ఇంటికి వచ్చారు. ప్రశంసించారు. ఏమాయ చేసావే తరువాత ఎంతో స్పెషల్ సినిమా మా వరకూ. ప్రేక్షకులకు.. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.. అని సమంత అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ.. శివ కథ చెప్పగానే ఉద్వేగం కలిగింది. తనపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇవాళ ప్రేక్షకులు కూడా అదే ఫీలవుతున్నారు. అన్ని చోట్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక నటుడిగా సంతృప్తిగా ఉంది. శివతో సినిమాలు చేస్తే గొప్ప నటుడిగా చూపిస్తాడు అనే నమ్మకమే నన్ను నడిపించింది అని తెలిపారు. మజిలీలో సమంత లాంటి భార్య ఉంటే ఎంత బావుంటుందోనని అంతా అంటున్నారు. థాంక్స్ అలాంటి మంచి భార్య నాకు దొరికిందని చైతూ సంతోషం వ్యక్తం చేయడం కొసమెరుపు. రెండేళ్లుగా అక్కినేని కాంపౌండ్ కి సరైన హిట్టు లేదు అన్నవాళ్లందరికీ మజిలీ ఓ సమాధానం అని అక్కినేనీస్ భావిస్తున్నారన్నమాట.