Begin typing your search above and press return to search.

స‌మంత కార్లో కూర్చుని ఏడ్చిన వేళ‌..

By:  Tupaki Desk   |   11 May 2016 1:00 PM IST
స‌మంత కార్లో కూర్చుని ఏడ్చిన వేళ‌..
X
సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా గుర్తింపు.. చేతిలో క్రేజీ ప్రాజెక్టులు.. వ‌రుస హిట్లు.. మ‌రి స‌మంత‌కు కార్లో కూర్చుని ఏడ‌వాల్సినంత క‌ష్టం ఏమొచ్చిందా అనిపిస్తోందా..? ఇది ప‌నిలో అల‌సట వ‌ల్ల వ‌చ్చిన ఏడుప‌ట‌. త‌న ఏడుపు గురించి ఆమె వివరిస్తూ..‘‘గ‌త ఏడాది నుంచి 8 నెలల పాటు నిర్విరామంగా ప‌ని చేశాను. రోజుకు 12 గంట‌ల చొప్పున క‌ష్ట‌ప‌డ్డాను. ఒక్కటంటే ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోలేదు. ఐతే స‌డెన్ గా ఓ రోజు కార్లో కూర్చుని ఉంటే ప‌క్క‌న ఎవ్వ‌రూ లేరు. నా ప‌రిస్థితి చూసి ఏడుపొచ్చేసింది. ఐతే త‌ర్వాత త‌మాయించుకున్నా. ఐతే నేను దేనికీ భ‌య‌ప‌డి కుంగిపోయే ర‌కం కాదు. చిన్న‌ప్ప‌టి నుంచి నాకు ప‌ట్టుద‌ల ఎక్కువ‌. ఎప్పుడూ వెనక‌డుగు వేయ‌ను‘‘ అని చెప్పింది స‌మంత‌.

తాను కొన్ని నెల‌లుగా ప‌డుతున్న క‌ష్టానికి ఇప్పుడు ఫ‌లితం ల‌భిస్తోంద‌ని స‌మంత చెప్పింది.‘‘స‌మ్మ‌ర్లో ఒకేసారి ఇలా నా సినిమాలు వ‌రుస‌గా విడుద‌ల‌వుతాయ‌ని ఊహించ‌లేదు. అది విధి రాత‌. ‘తెరి‘ పెద్ద క‌మర్షియ‌ల్ హిట్ట‌యింది. ‘24‘కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది.

ఇంకా బ్ర‌హ్మోత్స‌వం.. అఆ.. సినిమాలు రెండూ నా కెరీర్లో చాలా ప్ర‌త్యేక‌మైనవి. అవి కూడా క‌చ్చితంగా స‌క్సెస్ అవుతాయి. నా కెరీర్లో ఇది బెస్ట్ ఫేజ్‘‘ అని స‌మంత అంది. అంద‌రూ అనుకున్న‌ట్లు తాను ఫెయిల్యూర్ల‌ను ప‌ట్టించుకోన‌న్న‌ది త‌ప్ప‌ని.. త‌న సినిమాల రిజ‌ల్ట్స్ త‌న‌ను చాలా ప్ర‌భావితం చేస్తాయ‌ని.. ఓ కొత్త సినిమా రిలీజ‌వుతుంటే తాను ముందు రెండు రోజుల పాటు నిద్ర పోన‌ని స‌మంత చెప్పింది.