Begin typing your search above and press return to search.
మా ఇద్దరి పిల్లర్స్ ఆ ఇద్దరే..!
By: Tupaki Desk | 1 April 2019 7:12 AM GMTనాగచైతన్య - సమంత జంట నటించిన `మజిలీ` ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. శివనిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నిన్నటి సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో వెంకీ, నాగ్ ముఖ్య అతిధులుగా పాల్గొని ఆడియో సీడీల్ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈవెంట్ ఆద్యంతం అక్కినేని ఫ్యామిలీ ఫంక్షన్ లా ఎంతో ఎమోషనల్ గా సాగింది. ఈ వేదికపై అక్కినేని కోడలు సమంత కట్టిపడేసే అద్భుతమైన స్పీచ్ ని ఇచ్చారు. ముఖ్యంగా ఈవెంట్ ముఖ్య అతిధులు విక్టరీ వెంకటేష్ .. కింగ్ నాగార్జునను ఉద్ధేశించి సమంత చేసిన ఓ వ్యాఖ్య అక్కినేని- దగ్గుబాటి అభిమానుల్లో వైరల్ గా మారింది. ఆ క్షణం సామ్ కళ్లలోని ఉద్వేగాన్ని ఫ్యాన్స్ ప్రత్యేకించి ప్రస్థావిస్తున్నారు. అసలింతకీ సామ్ లో ఎందుకంత ఉద్వేగం? అంటూ ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు.
నాగ్, వెంకీ లేనిదే మేం (చై, సామ్) లేనే లేము అన్నంత ఎమోషన్ అయ్యారు సమంత. మజిలీ వేదికపై సమంత అక్కినేని మాట్లాడుతూ ``ఈవెంట్ అతిధులుగా విచ్చేసిన నాగ్ మామ.. వెంకీ మామ (మూవీ టైటిల్) ఇద్దరికి ధన్యవాదాలు. ఆ ఇద్దరూ మాకు పిల్లర్స్ (పునాదులు)తో సమానం. వాళ్లిద్దరి వల్ల ఒక పాజిటివ్ నమ్మకం వచ్చింది. వాళ్ల ప్రభావం మాపై చాలా ఉంది`` అని వ్యాఖ్యానించారు. ఇక మజిలీ సినిమా గురించి సమంత మాట్లాడుతూ.. ప్రేమ ఎక్స్ పీరియన్స్ చేయకముందు ప్రేమ అలా ఉంటుంది.. ఇలా ఉంటుంది అని ఊహించుకుంటాం. కానీ నిజం వేరుగా ఉంటుంది. ప్రతి ప్రేమకథ యూనిక్‌గా ఉంటుంది. మజిలీ నిజమైన లవ్‌స్టోరీ. లవ్ అంటే బలం. లవ్ అంటే ధైర్యం. ప్రేమంటే బాధ్యత. ఏమాయచేసావె, మనం తర్వాత మజిలీ నాకు ఇంపార్టెంట్ సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ``పెళ్లయ్యిన తర్వాత ప్రేమ``పై సినిమాలు చేయరెందుకు? అని అనిపించింది. శివగారు ఈ సినిమా కథతో వచ్చినందుకు ధన్యవాదాలు`` అన్నారు.
వెంకీ మామ.. నాగ్ మామ అంటూ సమంత చేసిన వ్యాఖ్యలపైనా.. పిల్లర్స్ అంటూ పొగిడేయడంపైనా అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. వెంకీమామ అనే సినిమా పేరును సామ్ ప్రస్థావించారు. అలాగే నాగార్జున ఎలానూ తనకు మామ గారే. కోడలయ్యాక అలానే పిలుస్తున్నారు సామ్. అదంతా సరే.. ఆ ఇద్దరూ పిల్లర్స్ ఎలా? అంటే ఎనిమిది దశాబ్ధాల టాలీవుడ్ సినీపరిశ్రమ ఆద్యంతం ఆ ఇద్దరూ ఉన్నారు గనుకే ఆ తర్వాత చైతన్య కానీ, సమంత కానీ ఈ రంగంలోకి వచ్చి నిలదొక్కుకోగలిగారన్నది సామ్ ఉద్దేశం. ఆ ఇద్దరూ లేకపోతే చైతూ లేడు. తాను కూడా లేనట్టే కదా?