Begin typing your search above and press return to search.

బీచ్ లో బికినీతో సమంత రచ్చ

By:  Tupaki Desk   |   25 Dec 2016 4:35 PM IST
బీచ్ లో బికినీతో సమంత రచ్చ
X
సమంత రూత్ ప్రభు.. చెన్నై బ్యూటీ అయినా టాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఎదిగిన ఈ సుందరి.. ఇప్పుడు తెలుగింటి కోడలు అయిపోతోన్న సంగతి తెలిసిందే. సినిమాలు కూడా బాగా తగ్గించేసుకుని.. అడపాదడపా షూటింగ్స్ లో మాత్రమే పాల్గొంటున్న శామ్స్.. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ ఫంక్షన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటోంది.

ప్రస్తుతం క్రిస్మస్ సీజన్ ప్రారంభం కావడంతో.. దాదాపుగా టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అందరూ వెకేషన్ లోనే ఉన్నారు. సమంత కూడా ఔట్ డోర్ వెళ్లిపోయి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తోడుగా తన కాబోయే భర్త నాగచైతన్యను కూడా పట్టికెళ్లిన శామ్స్.. అక్కడ బీచ్ లో బికినీలతో హంగామా చేసేస్తోంది. కాకపోతే.. బికినీ అందాలను స్క్రీన్ పై ఆరబోసిన అనుభవం లేకపోవడం.. అక్కినేని ఫ్యామిలీ కోడలు కానుండడంతో.. నీళ్లలో సగం వరకూ నుంచుని అటు తిరిగి ఫోటోలకు పోజులిస్తోంది సమంత.

ఇప్పటివరకూ సమంతను గ్లామరస్ యాంగిల్ లో అభిమానులు చాలాసార్లే చూశారు కానీ.. ఈ రేంజ్ లో బికినీతో దర్శనం మాత్రం ఇప్పుడే. మరి తమ వెకేషన్ ను.. పెళ్లికి ముందు చేసే ఎంజాయ్ మెంట్ ను స్వీట్ మెమరీస్ గా.. ఈ ఫోటోలను చైతునే తీసి పోస్ట్ చేస్తున్నాడో లేదో తెలీదు కానీ.. సమంత చేస్తున్న ఈ బికినీ రచ్చ మాత్రం హాట్ టాపిక్ అయిపోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/