Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి : అబ్బ‌బ్బా!! బిక‌నీలో సామ్‌

By:  Tupaki Desk   |   8 Feb 2018 4:03 PM IST
ఫోటో స్టోరి : అబ్బ‌బ్బా!! బిక‌నీలో సామ్‌
X
పెళ్లయిన‌ప్ప‌టి నుంచి స‌మంత చాలా బోల్డ్ అయిపోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. తాను చేయాల‌నుకున్న‌ది చాలా ధైర్యంగా చేసేస్తోంది. అంత‌కుముందెప్పుడు లేని విధంగా... ఇప్పుడు బికినీలో ద‌ర్శ‌నమిస్తోంది. అది చూసి కొంద‌రు అభిమానులు పండ‌గ చేసుకుంటే... మ‌రికొంద‌రు మాత్రం ఏంటీ సామ్ ఈ అవ‌తారం అని బాధ‌ప‌డుతున్నారు.

అక్కినేని వారి ఇంటి కోడ‌లు అయ్యాక సామ్ ప‌ద్ద‌తిగా - ట్రెడిష‌న‌ల్ లుక్ లో క‌నిపిస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే చాన్నాళ్లు అదే తరహాలో కనిపించింది. కాని న్యూ ఇయర్ నుండి మాత్రం రూటు మార్చింది. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా త‌న హాట్ లుక్‌ను చూపిస్తూనే ఉంది. ఈ మధ్యన దానికితోడు బోల్డు స్టేట్మెంట్లతో మతిపోగొడుతోంది. ఇప్పుడేమో చాలారోజుల నుండి అలసిపోయాను.. వెకేషన్ అనేది కోరిక కాదు అవసరం అంటూ.. అదిగో అలా బీచ్ లో సేద తీరుతోంది. బహుశా మారిషస్ లో అనుకుంట.. అమ్మడు అలా టూ పీస్ బికినీ వేసుకుని.. చక్కగా రిలాక్స్ అవుతూ.. ఇక్కడ కుర్రాళ్ళకు మతిపోగొడుతోంది.

ఇన్నాళ్ళూ బాలీవుడ్ లో మాత్రం పెళ్ళయిన తరువాత కూడా కరీనా కపూర్ అండ్ మలైకా కపూర్ వంటి హాటీమణులు తమ అందాలతో ఉడికిస్తారు అని చెప్పుకునే తెలుగు ఆడియన్స్ కు.. ఇప్పుడు మాక్కూడా ఒక హాటీ ఉంది.. ఆమె పేరే సమంత అని గట్టిగా గొంతెత్తి చెప్పాలని అనిపించేస్తోందనడంలో అతిశయోక్తి లేదు.