Begin typing your search above and press return to search.
వామ్మో సామ్ రేంజ్ ఇదా?
By: Tupaki Desk | 6 April 2019 6:03 AM GMTగత కొంత కాలంగా డల్ గా ఉన్న బాక్స్ ఆఫీస్ కు ఊపిరి నిచ్చేలా కనిపిస్తున్న మజిలీ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ మీదున్నాయి. మూడు రోజులు వరసగా సెలవులు రావడంతో చైతుకి ఇది చాలా పెద్ద అడ్వాన్టేజ్ గా మారనుంది. ఇకపోతే చైతు సామ్ లలో ఎవరు బాగా చేశారు అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. దానికి సమాధానం చెప్పడం కష్టం కానీ స్టార్ కిడ్ గా తన టాలెంట్ తో నిలబడిన నాగ చైతన్యకు ఫాన్ ఫాలోయింగ్ ఉండటం సహజం.
కానీ సమంతా కేసు వేరు. తను హిరోయిన్. అందులోనూ ఏడాది క్రితమే పెళ్లయ్యింది. సహజంగా సౌత్ లో మూడు ముళ్ళు పడ్డ కథానాయికలకు ఆదరణ తగ్గుతుంది. అందుకే వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతారు. కానీ సామ్ ఆ మూసలో వెళ్ళకుండా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది. వరస ఆఫర్లతో ఏ మాత్రం తగ్గని రేంజ్ లో ఇంకా అదరగొడుతుండగా నిన్న సినిమా హాళ్లలో తన పాత్ర ఎంట్రీకి వచ్చిన రెస్పాన్స్ కి మిగిలిన ఫాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు
నిజానికి సమంతా పాత్ర మజిలీలో సినిమా మొత్తం ఉండదు. కేవలం ఇంటర్వెల్ బ్యాంగ్ కు ఐదు నిమిషాల ముందు వస్తుంది. అయితే థియేటర్లలో తడుస్తున్న వర్షంలో ఆటోలో దిగుతున్న సమంతాకు విజిల్స్ కేకలతో అభిమానులు స్వాగతం చెప్పడం చూస్తే ఇది అందరికి దక్కేదేనా అనిపించక మానదు.
ఇక అక్కడినుంచి సామ్ అంత తన చేతుల్లోకి తీసుకుని చైతుకి పోటీగా సెకండ్ హాఫ్ మొత్తం నడిపించడం పెద్ద ప్లస్ అవుతోంది. అది ఎంతగా అంటే ఫస్ట్ హాఫ్ లో ఉండే కీలకమైన దివ్యాన్షుని మర్చిపోయేంతగా. ముఖ్యంగా క్లైమాక్స్ లో సామ్ ఓ రేంజ్ లో పిండేసిందని పబ్లిక్ టాక్. ఏదైతేనేం అక్కినేని కోడలి స్పీడ్ రేంజ్ మాములుగా లేదని నిన్న మజిలీతో మరోసారి క్లారిటీ వచ్చినట్టే