Begin typing your search above and press return to search.
సమంత కామెడీలు మానట్లేదబ్బా..
By: Tupaki Desk | 17 Sep 2016 7:49 AM GMTసోషల్ మీడియాలో ఎవరినైనా ట్రోల్ చేయాలంటే సమంత తర్వాతే ఎవరైనా అంటారు. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తుంది కానీ.. ఆమె చమక్కులు మాములుగా ఉండవు. తాజాగా తన పెళ్లి విషయంలో కొన్ని నెలలుగా ఆమె ట్విట్టర్లో చేస్తున్న కామెడీలు మామూలుగా లేవు. ఓవైపు చైతూతో పెళ్లికి రెడీ అయిపోతూ.. వాళ్ల ఫ్యామిలీ ఫంక్షన్లకు కూడా హాజరైపోతున్న సమంత.. ఇప్పటికీ తన పెళ్లి విషయంలో వస్తున్న వార్తలన్నీ ట్రాష్ అంటుండటం ఆమె ఏంటో తెలియజేస్తుంది.
పెళ్లి నేపథ్యంలోనే సమంత సినిమాలు ఒప్పుకోవట్లేదన్నది జనాల్లో ఉన్న బలమైన అభిప్రాయం. చివరికి చైతూతో చేయాల్సిన సినిమా నుంచి కూడా ఆమె తప్పుకుంది. ధనుష్-వెట్రిమారన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘వాడా చెన్నై’కి కూడా ఆమె టాటా చెప్పేయడం తెలిసిన సంగతే. ఇంక వేరే సినిమాలేవీ కూడా సమంత ఒప్పుకోలేదు.
ఐతే సరైన పాత్రలు రాకపోవడం వల్లే తాను సినిమాలు ఒప్పుకోలేదంటూ తాజాగా మరోసారి ఓ కామెడీ ట్వీట్ పెట్టింది సమంత. అంతటితో ఆగకుండా సౌత్ సినిమాల్లో ఒక అర్థవంతమైన పాత్ర దక్కించుకోవడం ఎంత కష్టమో ఇప్పుడర్థమవుతోందంటూ ఓ ట్వీట్ పెట్టింది సమంత. మరి ఇప్పటిదాకా సమంత వరుసగా సినిమాలు చేసింది కదా.. ఆ సినిమాలు.. ఆ పాత్రల మాటేంటి? మొన్న ‘జనతా గ్యారేజ్’లో ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర చేసింది కదా. మరి దాని సంగతేంటి? ఇప్పుడు వ్యక్తిగత కారణాలతో సినిమాలు ఒప్పుకోవడం మానేసిన సమంత.. కొత్తగా ఏదో రియలైజ్ అయిపోయినట్లు మాట్లాడ్డం కామెడీ కాక మరేంటి?