Begin typing your search above and press return to search.
సమంత.. తల్లిదండ్రుల్ని వదిలేసిందా?
By: Tupaki Desk | 2 Oct 2015 5:05 AM GMTసమంత పెద్ద మనసు గురించి మనందరికీ తెలుసు. తన సంపాదనలో కొంత భాగం పక్కనబెట్టి ‘ప్రత్యూష’ పేరుతో ఓ ఫౌండేషన్ నడుపుతూ అభాగ్యులైన చిన్నారుల్ని ఆదుకుంటున్న సంగతి తెలిసిందే. ఐతే తనకు సంబంధం లేని చిన్నారుల్ని అంతగా ఆదరిస్తున్న సమంత.. తన సొంత తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం లేదా? వాళ్లకు ఆమె దూరంగా ఉంటోందా? అప్పుడప్పుడూ కూడా వాళ్ల దగ్గరికి వెళ్లట్లేదా? ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో చూస్తుంటే ఇలాంటి సందేహాలే కలుగుతున్నాయి.
నిన్న చెన్నైలోని సమంత ఫ్లాట్ మీద ఇన్ కమ్ ట్యాక్స్ రైడ్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానెల్ ప్రతినిధులు సమంత తల్లిదండ్రులు ఉండే ఇంటికి కెమెరా పట్టుకుని వెళ్లిపోయారు. ఐతే కూతురి మీద ఇన్ కమ్ ట్యాక్స్ రైడ్స్ జరుగుతున్నాయన్న ఫ్రస్టేషన్ వల్లో ఏమో గానీ.. సమంత తల్లితో పాటు ఇంకో వ్యక్తి మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. మీడియా వాళ్లు వాళ్లనేమీ ఇరిటేట్ చేయనూ లేదు. అంతలోనే దాడికి దిగారు. కెమెరాను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఐతే ఇలా కెమెరా పట్టుకుని ఇంటికి వెళ్లిపోవడం కూడా తప్పే అనుకోండి. ఐతే మరీ అంత ఫ్రస్టేట్ అయిపోవడమూ ఆశ్చర్యం కలిగించింది.
ఐతే మొత్తం కెమెరాలో రికార్డవుతున్న సంగతి గుర్తించిన సమంత తండ్రి.. కొంత సేపటి తర్వాత మీడియా వాళ్లను కూల్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. సమంత ఇక్కడికి రానే రాదని.. ఆమెకు సంబంధించిన వస్తువులిక్కడేం లేవని.. తామేదో సింపుల్ గా తమ బతుకు తాము బతుకుతున్నామని ఆయననడం గమనార్హం. ఇన్ కమ్ ట్యాక్స్ రైడ్స్ నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారో.. లేక నిజంగానే సమంత తన తల్లిదండ్రుల్ని పట్టించుకోవట్లేదా అన్నదే తెలియడం లేదు.