Begin typing your search above and press return to search.
సమంత కుటంబం ఎక్కడా కనిపించదే??
By: Tupaki Desk | 10 Oct 2017 11:42 AM GMTఅంగరంగవైభవంగా ఆత్మీయులూ స్నేహితులూ బంధువుల మధ్యన హీరోయిన్ సమంత అలాగే అక్కినేని వారసుడు నాగచైతన్య ల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ కార్యక్రమాన్ని ఆడియన్స్ అందరూ మిస్సవుతారని అనుకుంటే.. స్వయంగా నాగర్జున అండ్ సమంతలే తమ ట్విట్టర్ ద్వారా ప్రతీ గంటగంటకూ ఫోటోలను రిలీజ్ చేస్తూ.. అసలు గోవాలోని డబ్లూ హోటల్ లో ఏం జరుగుతోందో ప్రపంచానికి క్షుణ్ణంగా చెప్పే ప్రయత్నం చేశారు.
ఒక ప్రక్కన రామానాయుడు గారి ఫ్యామిలీ.. మరో ప్రక్కన అక్కినేని ఫ్యామిలీ.. ఇలా అక్కడ కుటుంబాలు మమేకం అయిపోయి మెరిశాయి. కాని ఒక్క సందేహం ఏంటంటే.. అసలు ఒక్క ఫోటోలో కూడా సమంత కుటుంబీకులు లేరేంటి? కనీసం వధూవరులతో ఒక్క ఫోటో లేదు. అలాగే క్రిస్టియన్ వెడ్డింగ్ తాలూకు ఫోటోల్లో కూడా వారు ఎక్కడా కనిపించలేదు. అయితే ఫోటో లేదు అనేకంటే వారి ఫోటోలు బయటకు రాలేదు అనుకోవాలి అంటున్నారు సన్నిహితులు. ఎందుకంటే సమంతను అసలు క్రిస్టియన్ వెడ్డింగ్ రోజున స్టేజీ దగ్గరకు నడుచుకుంటూ చేయిపట్టుకుని తీసుకొచ్చింది సమంత పెద్దన్నయ్యే. గతంలో ఆమె పెద్దన్నయ్యా చిన్నన్నయ్యా ఇదే తరహాలో ఎంగేజ్మెంట్ లో కూడా మెరిశారు. ఇప్పుడు కూడా అదే విధంగా కనిపించారట.
అయితే విషయం ఏంటంటే.. అసలు ఫోటోల్లో సమంత ఫ్యామిలీ అంతా కనిపించేస్తే.. వారి గురించి ప్రపంచానికి తెలిసిపోయి ప్రైవసీ లేకుండా పోతుంది కాబట్టి.. వారు తమ ఫోటోలను రిలీజ్ చేయవద్దంటూ నాగర్జునను రిక్వెస్ట్ చేశారట. అందుకే వారి ఫోటోలేవీ రాలేదని తెలుస్తోంది. అయితే సమంత అమ్మానాన్నలు ఈ పెళ్ళికి రానేలేదు అనేవారూ లేకపోలేదు. అది సంగతి.