Begin typing your search above and press return to search.

సమంత ఫ్యాన్సు డిజప్పాయింటెడ్‌

By:  Tupaki Desk   |   11 Jan 2016 5:00 PM IST
సమంత ఫ్యాన్సు డిజప్పాయింటెడ్‌
X
టాలీవుడ్‌ నెం.1 హీరోయిన్‌ మన సమంతే. అయితే ఆ పొజిషన్‌ కు ఇప్పుడు రకుల్‌ ప్రీత్‌ ఎసరు పెట్టస్తోంది. కాజల్‌.. తమన్నా లు కొన్ని ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్టులతో దూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న వేళ.. అసలు సమంత ఎందుకు సినిమాల పరంగా యాక్టివ్‌ గా ఉండట్లేదు అనే విషయం ఓ మారు ప్రస్తావించుకోవాలి.

విక్రమ్‌ తో చేసి 10 ఎన్రాదుకుళ సినిమా తెలుగులో రాలేదు. అంటే ప్రాక్టికల్‌ గా చూస్తే.. సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమా తరువాత తెలుగు తెరపై మళ్లీ కనిపించలేదు బంగారం. ఈ మధ్య కాలంలో అమ్మడిని చూడటం అంటే మొన్న వచ్చిన బెంగుళూరు డేస్‌ తమిళ రీమేక్‌ బెంగుళూరు నట్కల్‌ టీజ‌ర్లో ఒక చ‌మ‌క్కులా మెరిసింది. కేవ‌లం కొన్ని సెక‌న్ల నిడివిలో అందాల స‌మంత క‌నిపించింది. ఆ ఐదు క్ష‌ణాలు ఫుల్లు జోష్‌ లో క‌నిపించింది అమ్మ‌డు. కాని దాదాపు ఇన్నేసి నెలల తరువాత సమంత ఇచ్చిన ట్రీట్‌ ఇదే అంటే అభిమానులు ఫీలవుతున్నారు.

స‌మంత ఓ వైపు బ్ర‌హ్మోత్స‌వం, అ.. ఆ మూవీలోనటిస్తోంది. కాని ఆ సినిమాల నుండి.. ఒక్క స్టిల్లు కూడా బయటకు రాలేదు. అందుకే సమంత అభిమానులు ఇప్పుడు కాస్త డిజప్పాయింటెడ్‌ గా ఉన్నారట.