Begin typing your search above and press return to search.
నా కూతురు దగ్గర నల్లడబ్బు లేదు
By: Tupaki Desk | 1 Oct 2015 1:30 AM GMTఈరోజు ఉదయం నుంచి సినిమా సెలబ్రిటీలపై ఐటీ దాడుల వార్త హాట్ టాపిక్ గా మారింది. విజయ్ - సమంత - నయనతార వంటి స్టార్లను టార్గెట్ చేసి ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వేకువ ఝాము నుంచి తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. ప్రశ్నలకు ఫ్యామిలీ సభ్యులు సమాధానాలు చెబుతూనే ఉన్నారు.
అయితే ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ గా సమంతకు పేరుంది. నల్లడబ్బు దాచుకునేంత తెలివితక్కువ పని చేస్తుందని అనుకోలేం. 100 కోట్ల మార్కెట్ మాయాజాలంతో స్పీడ్ మీద ఉన్నాడు విజయ్. పులి రిలీజ్ వేళ అతడిపై ఐటీ దాడి జరిగిందంటే అర్థం ఉంది. పోనీ మయూరి సక్సెస్ తో బోలెడంత పారితోషికాన్ని - పంపిణీ రూపంలో వచ్చే డబ్బును వెనకేసుకుని ఉంటుంది కాబట్టి నయన్ పై ఐటీ దృష్టి సారించింది అంటే అర్థం ఉంది. వీళ్లంతా బ్లాక్ మనీ దాచేశారని అనుకున్నా.. .. ఐటీ పేయీగా - ప్రత్యూష ఆర్గనైజేషన్ పేరుతో మంచి పనులు చేసే సెలబ్రిటీగా పాపులర్ అయిన సమంతపై ఇలా ఐటీ దాడులు తగునా? అని ప్రశ్నిస్తున్నారు అభిమానులు.
ఇదే విషయంపై సమంత తండ్రి జోసెఫ్ ప్రభు క్లారిటీనిచ్చారు. సమంత ఎలాంటి నల్లడబ్బును దాచి పెట్టలేదు. తన అకౌంట్లో కేవలం వేలలో మాత్రమే డబ్బు ఉంది. తనకి ఏ పాపం తెలియదని అన్నారు. అంతేకాదు ఇలా మీడియాలో విస్ర్తతంగా ప్రచారం జరుగుతోంది తప్ప ఇంకేమీ లేదని కొట్టిపారేసినట్టే మాట్లాడారు. సోదాలు జరిగాయి. వెళతారు అన్నట్టే జోసెఫ్ కాన్ఫిడెంటుగా మాట్లాడారు.
అయితే స్వయానా తండ్రి ఇలా మాట్లాడారు.. అంటే మరి సమంతపై ఉన్నట్టుండి ఇంత పెద్ద రేంజిలో చెన్నయ్‌లో, హైదరాబాద్ లో - ఇల్లు - అతిధి గృహం అనే తేడా లేకుండా ఐటీ సోదాలు ఎందుకు సాగుతున్నట్టు? అసలు సమంతపై ఎవరు ఫిర్యాదు చేసి ఉంటారు? తన ఎదుగుదల సహించనివారెవరైనా ఇలా కంప్లయింట్ ఇచ్చి ఉంటారా? ఇలాంటి సందేహాలెన్నో ముసురుకుంటున్నాయి. వీటికి సమంతనే స్వయంగా స్పందిస్తే బావుంటుందేమో!