Begin typing your search above and press return to search.
3 యూట్యూబ్ చానెల్స్ పై సమంత పరువునష్టం దావా
By: Tupaki Desk | 20 Oct 2021 10:38 AM GMTసమంత-నాగచైతన్యల మూడేళ్ల వివాహ బంధానికి ఇటీవలే తెరపడింది. గత కొంతకాలంగా వీరు విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నా అవి నిజం కాదంటూ అభిమానులు అనుకున్నారు. కానీ వాటినే నిజం చేస్తూ ఇక వైవాహిక బంధాన్ని కొనసాగించలేమంటూ సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరూ విడాకుల ప్రకటన చేయడం సంచలనమైంది.
‘ఏంమాయ చేశావే’ సినిమా సమయం నుంచి దాదాపు పదేళ్ల పాటు కలిసి ఉన్న వీళ్లు భార్యాభర్తలుగా విడిపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అయితే ఈ జంట విడిపోవడానికి అంత బలమైన కారణాలు ఏమై ఉంటాయా? అని పలువురు ఆరా తీశారు.
ఈ క్రమంలోనే కొన్ని యూట్యూబ్ చానళ్లు, మీడియాలు ఇష్టానుసారంగా కథనాలు అల్లాయి. సమంతను టార్గెట్ చేసి ఆమె పరువుతీసేలా విష ప్రచారం చేశాయి. సమంత -నాగచైతన్య విడాకులకు ప్రీతమ్ జుకల్కరే కారణం అంటూ కొన్ని యూట్యూబ్ చానెళ్లు, నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఇప్పటికీ ఈ ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు.
అయితే నిజానికి ప్రీతమ్ సమంతను అక్క అని అని పిలుస్తాడు.. అయినా యూట్యూబ్ చానెళ్లు, నెటిజన్లు మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తుండడంతో సమంత తాజాగా న్యాయపరమైన చర్యలకు దిగింది. తనపై సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా కథనాలు అల్లి పరువు తీసిన మూడు యూట్యూబ్ చానెళ్లపై కూకట్ పల్లి కోర్టులో సమంత పరువునష్టం దావా వేశారు. సమంత-నాగచైతన్య విడాకులపై ఈ యూట్యూబ్ చానెల్స్ దారుణంగా అసత్యాలు ప్రచారం చేశాయని సమంత పిటీషన్ లో పేర్కొన్నారు. హైకోర్టు న్యాయవాది బాలాజీ ఈ మేరకు కోర్టులో సమంత తరుఫున పరువు నష్టం పిటీషన్ వేసి వాదనలు వినిపించారు.