Begin typing your search above and press return to search.
''మేమందరం యంత్రాలు కాదుగా''
By: Tupaki Desk | 28 May 2016 8:24 AM GMTఈ మధ్యకాలంలో సోషల్ నెట్వర్క్ లో చాలా నెగెటివిటి ఎక్కువైపోయింది అనేది వాస్తవం. మన ఫేవరేట్ హీరో సినిమా సంగతేమో కాని.. పక్క హీరో సినిమా ఫ్లాపైతే మాత్రం పండగ చేసుకుంటున్నారు. మనం ఎగ్జామ్ లో పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కాని.. పక్కనోడు మాత్రం పాస్ అవ్వకూడదు అన్నట్లుంది యవ్వారం.
ఇదే విషయాన్ని సమంతను అడిగితే.. ''అవును నిజమే. నెగెటివిటీ ఎక్కువైంది. విమర్శలు అనేవి చాలా ఆలోచనాత్మకంగా ఉంటేవి.. తప్పకుండా వాటి నుండి నేను నేర్చుకుంటాను. అంతేకాని.. ఇష్టం వచ్చినట్లు బూతులు తిడితే ఎలా? మేమేమన్నా యంత్రాలమా? హార్ట్ అండ్ సోల్ లేని మెషీన్స్ కాదు యాక్టర్లంటే. రాళ్లం అంతకంటే కాదు. అందుకే నాకు మండితే వెంటనే రివర్స్ పంచ్ ఇచ్చేస్తాను'' అని చెప్పుకొచ్చింది. మొన్ననే ట్విట్టర్ లో ఎవరో అమ్మడి ''అ..ఆ'' కూడా ఫ్లాప్ కావాలని కోరుకుంటే.. జూన్ 2న నువ్వు కూడా ఫూల్ కావాలని అమ్మడు కోరుకుంది. దాని గురించి చెబుతూ ఇలా చెప్పుకొచ్చిందిలే.
బెంగుళూరు అ..ఆ సినిమాను ప్రమోట్ చేసిన సమంత.. అక్కడి మీడియాకు ఈ నెగెటివిటీ గురంచి పదేపదే చెప్పింది. బహుశా బ్రహ్మోత్సవం ట్రాలింగ్ తో విసిగిపోయినట్లుంది.