Begin typing your search above and press return to search.
గుడి దగ్గర భర్త గురించి భార్యను అడగటం బుద్ధి లేనిదా సామ్?
By: Tupaki Desk | 19 Sep 2021 4:12 AM GMTసెలబ్రిటీలకు ప్రైవేటు లైఫ్ ఉంటుందా? అన్నంతనే కస్సుమంటారు. మేం మనుషులం కాదా? అని క్వశ్చన్ వేస్తారు. అంతకు మించి సీరియస్ అవుతారు. ఎంత సెలబ్రిటీలు అయితే మాత్రం.. వాళ్లు కూడా రక్త మాంసాలు ఉన్న మనుషులే కదా? అన్న వాదనను వినిపిస్తారు. నిజమే.. ఆ వాదనను అంగీకరించాల్సిందే. కాకుంటే.. ఇక్కడో సమస్య ఉంది. సెలబ్రిటీలకు ఎలా అయితే ప్రైవసీ అన్నది ముఖ్యమో..సాదాసీదా జనాలకు కూడా అంతే ముఖ్యం కదా? తమకు తోచినప్పుడు తోచిన రీతిలో.. ఫోటోలు దిగేసి.. తమ పైత్యాన్ని.. ఆ సమయానికి తమకున్న మూడ్ ను జనాలకు రుద్దేసేటప్పుడు లేని ఇబ్బంది.. వారిని అభిమానించి.. ఆరాధించే వారికి కూడా అంతే హక్కు ఉంటుంది కదా?
తనకు నచ్చింది చేసి.. దాన్ని అందరికి పంచేందుకు మిగిలిన వారి ఎమోషన్స్ ను పట్టించుకోనప్పుడు.. మిగిలిన భావోద్వేగాలకు మాత్రం పరిమితులు ఉండాలనుకోవటం ఎంతవరకు న్యాయం? అన్నది ప్రశ్న. అడిగేవాడు లేకపోతే.. చెప్పేటోడు చెలరేగిపోతారన్నట్లుగా మారింది సెలబ్రిటీల తీరు. వారు నిర్వహించుకునే సోషల్ మీడియా ఖాతాలన్ని కూడా బంగారు బాతుగుడ్లు. వారు పెట్టే ప్రతి పోస్టుకు భారీగా డబ్బులు దండుకుంటారు. అంటే.. ప్రజల అభిమానం వారికి ఆదాయ వనరు అన్నట్లే. అంటే.. వారి ఆదాయానికి ప్రజలు ఇతోధికంగా సాయం చేస్తున్నట్లే కదా?
అలాంటప్పుడు తమ ఆదాయానికి దన్నుగా నిలిచే వినియోగదారుల విషయంలో వ్యాపార సంస్థలు ఎంతటి బాధ్యతగా వహిస్తాయో? అంతే బాధ్యతగా సెలబ్రిటీలు కూడా వ్యవహరించటంలో తప్పేం లేదు కదా? తమకు నచ్చినప్పుడు పొట్టి పొట్టి బట్టలతో పాటు కవ్వించే ఫోజులు ఇచ్చి మరీ జనం మీదకు వదులుతారు. అలాంటి వేళలో.. ఒక అభిమాని ఇంట్లో విషాదం నెలకొని ఉండొచ్చు. మరో అభిమాని సామ్ మాదిరే పవిత్రమైన దేవాలయంలో ఉండి ఉండొచ్చు. ఇంకొకరు సీరియస్ గా తమ పనిలో మునిగి ఉండొచ్చు.
ఇలా కోట్లాది మంది తమ పనుల్లో తాము ఉన్నప్పుడు.. పోస్టు పెట్టినంతనే నోటిఫికేషన్ రూపంలో గంట మోగి.. చేస్తున్న పని వదిలేసి.. కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ లో మునిగిపోయే బలహీనత ఉన్నంత కాలం సెలబ్రిటీలు ఇలానే వ్యవహరిస్తారేమో? తాజాగా తిరుమలకు వచ్చిన సామ్ ను అక్కడి మీడియా వారు అడిగింది.. ఫోటోలు తీస్తామని.. కాస్త హెల్ప్ చేయమని.. మరొకరు ఇటీవల భర్త చైతన్యతో విడాకుల ఎపిసోడ్ బలంగా వినిపిస్తున్న వైనాన్ని ప్రశ్నించారు. అయినా.. ఒక డౌట్ ఏమంటే.. భర్త ప్రస్తావన భార్య వద్ద గుడి దగ్గర తీసుకొస్తే అంత పాపమా? బుద్ది లేనంత పెద్ద ప్రశ్న అవుతుందా? అన్నది కొత్త సందేహంగా మారింది.
నిజానికి.. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏదైనా విషయం ఉంటే నేరుగా చెప్పొచ్చు. లేదంటే నో కామెంట్ అని కూడా చెప్పొచ్చు. అందుకు భిన్నంగా గుడి దగ్గర బుద్ధిలేని మాటలంటూ విరుచుకుపడటంలో అర్థమేంది? అన్నది ప్రశ్న. మీ గురించి రూమార్స్ వస్తున్నాయని సామ్ ను అడిగితే.. గుడిచి వచ్చి బుద్ధి ఉందా? అంటూ కోపంగా బదులిచ్చారు. దీనిపై అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
గుడి దగ్గర భర్త గురించి అడిగే ప్రశ్న కూడా బుద్ధి లేనిదే అయితే.. బుద్ది ఉన్న ప్రశ్న ఏమిటో కాస్త సెలవిస్తే.. మిగిలిన వారంతా అర్థం చేసుకుంటారు సామ్ అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. నిజానికి ఈ మధ్యన హాట్ టాపిక్ గా మారి.. ఇబ్బందికరంగా మారిన ప్రశ్నకు సమధానం నిజమే అయితే.. దాన్ని తర్వాత చెబుతామని చెప్పొచ్చు. అంతేకానీ ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం ఏమీ లేదు కదా? వేళాపాళ లేనట్లుగా ఎప్పుడు ఏం తోస్తే అది చేస్తూ.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకునే స్టార్స్ ఎప్పుడో కానీ బయట కనిపించరు. అలా కనిపించినప్పుడు.. హాట్ టాపిక్ గా మారిన అంశాల గురించి అడగకుండా ఎందుకు ఉంటారు సామ్? దానికే ఇంతలా ఆగమైపోతే ఎలా?