Begin typing your search above and press return to search.
సమంత ఫస్ట్ జాబ్ అండ్ పారితోషికం
By: Tupaki Desk | 18 April 2022 11:34 AM GMTహీరోయిన్ గా సమంత ప్రస్తుతం వరుసగా పెద్ద సినిమాలు చేస్తూ కోట్ల రూపాయల పారితోషికంను అందుకుంటుంది. ఇటీవల పుష్ప సినిమాలో ఊ అంటావా ఊఊ అంటావా అనే ఐటెం సాంగ్ ను చేయడం కోసం కోటిన్నరకి పైగా పారితోషికం తీసుకున్న విషయం తెల్సిందే. ఒక్కో సినిమాకు రెండు మూడు కోట్ల వరకు పారితోషికంను దక్కించుకుంటున్న సమంత ఒకప్పుడు ఎంత తక్కువ పారితోషికం తీసుకుందో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.
సమంత హీరోయిన్ గా ప్రస్తుతం చేస్తున్న సినిమాల జోరు మామూలుగా లేదు. ప్రస్తుతం సినిమాకు కోట్లాది రూపాయల పారితోషికం తీసుకుంటున్న సమంత సినిమాల్లోకి రాకముందు కేవలం వందల్లో వేలల్లో పారితోషికంగా జాబ్ చేసేదట.. మోడలింగ్ లో కూడా ఆమె పారితోషికం బాగానే తీసుకునేదట. ఆమె మొదటి పారితోషికంగా అయిదు వేల రూపాయలను తీసుకుందట.
చెన్నై లో ఒక కార్యక్రమం లో ఈ అమ్మడు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని హోస్టింగ్ చేసిందట. అందుకు గాను అయిదు వేల రూపాయలను ఈ అమ్మడు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సమంత తీసుకుంటున్న పారితోషికంకు అప్పటి పారితోషికంకు పొంతనే లేదు కదా.. కష్టపడి వర్క్ చేస్తే అదృష్టం కలిసి వస్తే తప్పకుండా ఫలితం అనేది దక్కుతుందని సమంత విషయంలో నిరూపితం అయ్యింది.
సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ఆ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరో వైపు యశోద సినిమా కూడా షూటింగ్ జరుగుతోంది. తమిళ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. బాలీవుడ్ లో కూడా ఈమె సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.