Begin typing your search above and press return to search.

సమంత ఫిట్నెస్ ఫ్రీక్.. వీడియో వైరల్!

By:  Tupaki Desk   |   13 April 2021 6:00 AM IST
సమంత ఫిట్నెస్ ఫ్రీక్.. వీడియో వైరల్!
X
స్టార్ హీరోయిన్ సమంత గురించి సినీప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అటు సినిమాలపరంగా ఇటు ఫిట్నెస్ పరంగా ఆమె ఎంత జాగ్రత్తగా ఉంటుందో అందరికి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎల్లప్పుడూ వ్యాయామాలతో పాటు ఆమె ఫిట్నెస్ కు సంబంధించిన అన్ని డైలీ ప్రాక్టీస్ చేస్తూ అభిమానులకు, సాటి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నిజానికి సౌత్ ఇండస్ట్రీలో మైమరిపించే నాజూకుదనంతో పాటు ఆకట్టుకునే ఆకట్టుకునే అందం సమంత సొంతం. అందుకే పదేళ్లుగా తెలుగు ప్రేక్షకులకు హాట్ ఫేవరేట్ గా కంటిన్యూ అవుతోంది. సమంత ఫిట్నెస్ పట్ల దినచర్యలో చాలా కఠినంగా ఉంటుంది. అటు ఫుడ్ విషయంలో అలాగే వ్యాయామం టైం విషయంలో.

అయితే సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ ఉంటుందో.. అదేవిధంగా ఆమె ఫిట్నెస్ వీడియోస్ కూడా అదే రేంజిలో వైరల్ అవుతుంటాయి. తాజాగా మరో వీడియోతో అభిమానులను పలకరించింది సామ్. ఈ వీడియోలో ఏకంగా 'హ్యాండ్ స్టాండ్'(అంటే రెండు చేతులపై నిలబడం) ఆసనం వేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె హ్యాండ్ స్టాండ్ చేయడం చూస్తేనే అర్ధమవుతుంది. దాని వెనక సామ్ ఎంతగా కష్టపడిందో. స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి ఆ వీడియోలో సమంత.. పింక్ జిమ్ ప్యాంటు ధరించి చేతుల సహాయంతో తలను బాలన్స్ చేస్తోంది. ఈ వీడియోలో సమంత ఫీట్ చూసి నేటిజన్లు అభిమానులు ప్రశంసలలో ముంచెత్తుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సామ్ గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలంతో పాటు కాతువకుల రెండు కాదల్ సినిమాలు చేస్తోంది.