Begin typing your search above and press return to search.
2016లో 5 సార్లు.. మిలియన్ క్లబ్బులో..
By: Tupaki Desk | 6 Sep 2016 10:30 PM GMTమిలియన్ డాలర్ క్లబ్ అంటూ.. హీరోల గురించి లెక్కలు చాలాసార్లే చెబుతుంటారు కానీ.. హీరోయిన్ల విషయానికొస్తే.. యూఎస్ వరకూ సమంతను కలెక్షన్ క్వీన్ అనాల్సిందే. ఈ భామ నటించిన సినిమాల్లో దాదాపు సగం.. ఇక్కడ ఇరగదీసి ఆడేశాయి.
ఇప్పటివరకూ సమంత 26 సినిమాల్లో కనిపిస్తే.. ఇందులో 11 సినిమాలు మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటర్ అయ్యాయంటే.. ఇక్కడి జనాలు సమంత సినిమాలను ఎంతగా ఆదరిస్తారో అర్ధమవుతుంది. ఇది ఇప్పటివరకూ ఉన్న ట్రెండ్ అయితే.. 2016లో అమ్మడి స్పీడ్ మామూలుగా లేదు. ఈ భామ కనిపిస్తే చాలు.. మిలియన్ డాలర్లు వచ్చి పడిపోతున్నాయి. మొదట విజయ్ తో నటించిన తెరి.. ఆ తర్వాత సూర్యతో చేసిన 24.. ఆ వెంటనే మహేష్ బాబుకి జోడీగా నటించిన బ్రహ్మోత్సవం.. అ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో నితిన్ జంటగా చేసిన అ..ఆ., లు మిలియన్ డాలర్లు వసూలు చేశాయి.
ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి రొమాన్స్ చేసిన జనతా గ్యారేజ్ కూడా ఇప్పటికే ఆ క్లబ్బులోకి ఎంటర్ అయిపోయింది. అంటే.. ఏప్రిల్ నుంచి మొదలు పెడితే.. ఆరు నెలల్లో 5 సినిమాలు ఈ ఫీట్ సాధించాయన్న మాట. కానీ సమంత మాత్రం.. అంతా డైరెక్టర్ల గొప్పదనమే తప్ప... తన కోసమే సినిమాలు ఆడవు అంటూ తన సింప్లిసిటీ చాటేస్తోంది.