Begin typing your search above and press return to search.

గ్యారేజ్ కోసం శామ్స్ సోకుల పెట్టుబడి

By:  Tupaki Desk   |   11 Jun 2016 5:30 AM GMT
గ్యారేజ్ కోసం శామ్స్ సోకుల పెట్టుబడి
X
అ..ఆ.. మూవీ అంతా ఒక ఎత్తయితే.. సౌత్ సుందరాంగి సమంత బ్యూటీ మరొక ఎత్తు. ఈ మూవీ కోసం శామ్స్ చాలానే కష్టపడింది. యాక్టింగ్ పరంగానే కాదు.. అందాల ఆరబోతలోనూ - గ్లామర్ డోస్ లోను కూడా రెచ్చిపోయింది. సమంతలో అందం తగ్గిపోతోందని కరిగిపోతోందని వచ్చే కామెంట్స్ కు మంచి ఆన్సర్ నే ఇచ్చింది ఈ భామ. ఇప్పుడు జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ తో కలిసి కనిపించనుండగా.. ఇందులో సమంత తన అందాలను బాగానే పెట్టుబడి పెట్టేస్తోంది.

ఇప్పటికే జనతా గ్యారేజ్ షూటింగ్ లో జాయిన్ అయిన సమంత.. ఓ మాంచి మాస్ బీట్ కి చిందులు వేసేస్తోంది. మరి ఎన్టీఆర్ తో డ్యాన్సుల విషయంలో పోటీ పడ్డం కష్టం కాబట్టి.. తన స్టైల్ లో అందాలను పరిచేయాలని నిర్ణయించేసుకుందని అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే తన సోకులన్నీ చూపించే డ్రస్సులు వేసేస్తోందట. గ్లామర్ ప్రెజెన్స్ విషయంలో ఇప్పటివరకూ సమంత చేసిన సినిమాలు అన్నిటి కంటే.. గ్యారేజ్ లో ఆరబోత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

సమంత సన్నిహితులు ఇస్తున్న లీకులు బాగానే ఉన్నాయ్ కానీ.. సమంత ఇప్పటివరకూ చూపించని అందాలు పెద్దగా ఏం లేవని చెప్పుకోవాలి. సూర్యతో చేసిన సికిందర్ సినిమా కోసం బికినీ కూడా వేసేసింది శామ్స్. ఇప్పుడు మరి కొత్తగా జనతా గ్యారేజ్ కోసం ఏయే అందాలను బయటకు తీస్తోందో.?