Begin typing your search above and press return to search.
తిరిగి ఇచ్చేస్తున్నా అంటున్న సమంత!
By: Tupaki Desk | 3 Aug 2016 7:48 AM GMTసమాజానికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలన్న కాన్సెప్ట్ ను బ్యూటీ సమంత ఫాలో అవుతోంది! సినిమాల్లో బాగానే సంపాదిస్తున్నాననీ - దాన్లో కొంత భాగాన్ని సమాజ సేవకు కేటాయిస్తున్నాను అని చెబుతోంది. త్వరలోనే ప్రేమ పెళ్లికి సిద్ధమౌతున్న సమంతకు సమాజ సేవ అంటే ఇష్టమట! ఇదేదో ఇవాళ్ల కొత్తగా పుట్టిన ఇష్టం కాదండీ! ఇతరులకు ఎంతో కొంత సాయం చేయడం అనేది తనకు చిన్నప్పటి నుంచీ అలవాటే అని చెబుతోంది సమంత. బాల్యంలో ఉండగా చిన్నచిన్న సేవా కార్యక్రమాలు చేసేదాన్ననని చెప్పింది. సాయం చేయడంలో ఉన్న సంతృప్తే వేరు అని అంటోంది.
నటిగా ఈ స్థాయికి వస్తానని కలలో కూడా ఊహించలేదని సమంత చెబుతోంది. తనకంటే ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారనీ, అదృష్టం కొద్దీ తనకు అవకాశాలు వస్తున్నాయని చెప్పింది. ఈ రోజు ఇంత డబ్బు తన దగ్గర ఉందంటే కారణం సొంత తెలివితేటలు కాదనీ అంతా అదృష్టమే అని చెబుతోంది. తనకి ఇంత గుర్తింపు, ఆర్థిక స్థోమత ఇస్తున్న సమాజం కోసం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతోనే ప్రత్యూష ఫౌండేషన్ ఏర్పాటు చేశానని సమంత చెబుతోంది.
ఈ ఫౌండేషన్ ద్వారా పేదలకు సాయం చేయాలనుకుంటున్నానని, ముఖ్యంగా పేద విద్యార్థుల చదువు చెప్పించాలన్నది ఈ ఫౌండేషన్ లక్ష్యమని వివరించింది. ప్రతీ ఒక్కరు తమ స్థాయిలో తోటివారికి సాయం చేయాలని, సాయం పొందినవారు కళ్లలో ఆనందం చూస్తున్నప్పుడు కలిగే సంతృప్తి వేరని ఆమె చెప్పుకొచ్చారు. అందుకే, సేవా కార్యక్రమాలను తన జీవితంలో ఒక భాగంగా మార్చుకున్నానని సమంత చెప్పింది. ఏదేమైనా, మంచి పని చేస్తున్న సమంతను అభినందించాలి. వీలైతే ఆదర్శంగా తీసుకోవాలి, ఏమంటారు?