Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: అజంతా శిల్పానికే సిగ్గేసింది
By: Tupaki Desk | 19 March 2015 7:30 AM GMTక్యూట్ సమంత ఏం చేసినా సంచలనమే. తను అందానికే అందం.. అలంకరణకే అలంకరణ. ఈ భామ ఏ డ్రెస్ వేసినా ఆ డ్రెస్‌కే అందం వచ్చేస్తుంది. ప్రస్తుతం సౌతిండియా షాపింగ్ మాల్‌కి ప్రచారం చేస్తోంది. కొత్తగా సమ్మర్ కలెక్షన్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. చీరల్లోనూ కొత్త కొత్త డిజైన్లు వచ్చేశాయి. అందులోంచి ఓ చీరకట్టి కెమెరా ఫ్లాష్‌ల ముందు మెరిసింది అమ్మడు. ప్రఖ్యాత ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ జి.వెంకట్రామ్ ఫోటోగ్రఫీలో ముగ్ధమనోహరిలా అలంకరించుకుని మరీ కనిపించింది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది.. అన్న పాటను తలపించేలా సమంత ఓ అద్భుతమైన డిజైనర్ శారీలో దర్శనమిచ్చింది. తనకోసమే డిజైన్ చేశారా? అన్నంత అందమైన చీర అది. ఈ చీరలో సమంత లుక్స్ అదిరిపోయాయి అన్న ప్రశంసలొస్తున్నాయి. ఈ సీజన్‌లో సౌతిండియన్ షాపింగ్ మాల్ వసూళ్లు రెట్టింపైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత అందంగా ఆ చీరలో కనిపిస్తోంది సమంత.