Begin typing your search above and press return to search.

సమంత... నాలుగు మంచి మాటలు

By:  Tupaki Desk   |   27 Jan 2018 10:45 AM IST
సమంత... నాలుగు మంచి మాటలు
X
తెలుగు - తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ అయిన సమంత సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా ఉంటుంది. అక్కినేని హీరో నాగచైతన్యతో పెళ్లికి ముందు వాళ్లిద్దరి పర్సనల్ విశేషాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వచ్చింది. తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన తరవాత హ్యాండ్లూమ్ డ్రస్సులను పబ్లిసిటీ చేస్తూ ఎన్నో పోస్టులు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

పెళ్లి తరవాత కొద్ది రోజులు సినిమాలకు బ్రేకిచ్చిన మళ్లీ యాక్టింగ్ లో బిజీ అయిపోయింది. అందులో భాగంగానే సౌత్ మొత్తం ఫ్లైట్లలో చుట్టేస్తోంది. ఈమధ్య జర్నీ టైంలో తీసుకున్న ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇదే టైంలో అభిమానులకు చిన్న ఉపదేశం లాంటిది కూడా ఇచ్చింది. ‘‘పోరాటంపై నమ్మకం ఉంచండి. అదృష్టం కోసం వెతుక్కుంటూ ఆగిపోకండి'’ (Believe in the hustle..Don't f*** with luck!!) అనే అర్ధం వచ్చేలా తన అభిప్రాయాన్ని రాసి అందరికీ షేర్ చేసింది. చివరి క్షణం వరకు పోరాడి నిలువు అంటూ అందరిలో మాంచి ఇన్ స్పైరింగ్ వాక్యాలు రాసింది. ఓ సినిమా స్టార్ లా కాకుండా ఓ ట్రావెలర్ లా కనిపిస్తూ సమంత పెట్టిన పోస్ట్ అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది.

సమంత తెలుగులో నటించిన సినిమాల్లో మహానటి.. రంగస్థలం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె తమిళ సినిమాల షూటింగులో సమంత బిజీగా ఉంది. రెమో ఫేం శివ కార్తికేయన్ హీరోగా డి.ఇమ్మాన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కోసమే తమిళనాడులోని టెంకాశికి బయలుదేరి వెళ్లింది.