Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కన్నీటి పర్యంతమైన సమంత

By:  Tupaki Desk   |   7 Oct 2017 4:58 PM GMT
ఫోటో స్టోరి: కన్నీటి పర్యంతమైన సమంత
X
అమ్మాయిల మనసులు ఎంతో సున్నితత్త్వం గా ఉంటాయని మన కవులు చాలాసార్లే చెప్పారు. ఇప్పటికీ సినీ రచయితలు ఆడవారి మనస్సును ఎంత అందంగా వర్ణిస్తారో తెలిసిందే. అయితే అంతటి సున్నితమైన మనస్సులో ఎప్పటికైనా ఒక మగడు చేరక మానడు. అప్పుడు ఆ మనస్సులో ఒక ప్రేమతో కూడిన భావోద్వేగం కన్నీళ్ల రూపంలో బయటపడుతుంది. సరిగ్గా ఇప్పుడు సమంత విషయంలో అదే జరిగింది.

జీవితంలో ఆనందం ఎప్పుడు ఉంటుంది. బాధ కూడా వస్తూనే ఉంటుంది. కానీ ఆ రెండిటి మధ్య ఎదో ఒక తెలియని భావోద్వేగం ఉంటుంది. పుట్టిన ప్రతి అమ్మాయి ఆ ఘడియను దాటకుండా వెళ్ళలేదు. నచ్చినవాడు మేడలో మంగళ సూత్రం కడుతున్నప్పుడు గుండె ను తాకే తాళి నేను ఉన్నాను అనే భరోసాను ఇస్తుంది. ఆ భరోసానే భర్త. సమంత కూడా అదే అనుభూతుని పొంది తన పెళ్లిలో అంతే భావోద్వేగానికి లోనైంది. చైతు తాళి కట్టినప్పుడు ఆమె ఒక స్టార్ కన్నా ఒక సాధారణ ఆడపిల్లలా అందరికి కనిపించింది.

ప్రేమించే వ్యక్తి భర్తగా రావడం కన్నా ఒక అమ్మాయికి ఈ ప్రపంచంలో మరొక గొప్ప విషయం లేదనే చెప్పాలి. అబ్బాయికి కూడా అంతే అనుకోండి. ఇకపోతే అక్కినేని వారి ఆప్యాయత కూడా సమంతకి బాగా నచ్చేసింది. అందుకే ఆ ఉద్వేగ క్షణాల్లో కళ్ళెమ్మట నీళ్ళొచ్చేశాయి. ఇంతకంటే ఒక అమ్మాయికి ఏం కావలి అనేలా సమంత భావోద్వేగానికి లోనైందని ఆ ఫొటో చూస్తుంటే అర్ధమవుతోంది.