Begin typing your search above and press return to search.
చెర్రీ మూవీ షూటింగ్ ఆపేయలేదట
By: Tupaki Desk | 28 April 2017 10:20 AM ISTసౌత్ బ్యూటీ సమంత ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వలో రూపొందే ఈ మూవీ తొలి షెడ్యూల్ షూటింగ్ ను.. రీసెంట్ గానే పూర్తి చేశారు. సమంతకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో.. అనుకున్న తేదీ కంటే ముందే ఈ షెడ్యూల్ కు ప్యాకప్ చెప్పేశారనే టాక్ వినిపించింది.
సుక్కు-చెర్రీ-సమంత కాంబినేషన్ రూపొందుతున్న ఈ మూవీని దాదాపుగా పల్లెటూరి నేపథ్యంలోనే రూపొందనుంది. షూటింగ్ మరొక్క రోజులో పూర్తయిపోతుందనగా.. సడెన్ గా సమంత పడిపోయింది. ఎండ దెబ్బకు తాళలేక శామ్ స్పృహ కోల్పోయిందట. ఈ కారణంగానే షూటింగ్ ఆపేశారనే టాక్ ఉంది కానీ.. నిజానికి కొంత సమయంలోనే తిరిగి కోలుకున్న సమంత మళ్లీ సెట్స్ కు వచ్చేసిందట. అయితే.. రామ్ చరణ్ ఈ విషయంలో చొరవ తీసుకుని మరింతగా రెస్ట్ తీసుకోమని సూచించాడట. ప్రస్తుతం జరిపిన షెడ్యూల్ లో ఓ పాటతో పాటు కొన్ని ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించినా.. ఇంకా కొంత భాగం మళ్లీ ఇక్కడే తీయాల్సి ఉండడంతో.. ఇప్పుడు బ్రేక్ పడే ఒక్క రోజును మరుసటి షెడ్యూల్ లో పూర్తి చేయచ్చని సలహా ఇచ్చాడట.
పలు ప్రధానమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే.. సమంత అనారోగ్యంపై ఆమె సన్నిహితులు సమచారం ఇస్తున్నారు. ప్రస్తుతం తను పూర్తిగా కోలుకుందని.. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఆమెకు తలెత్తలేదని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/