Begin typing your search above and press return to search.
మరో వంద జన్మలకూ నిన్నే కోరుకుంటా...
By: Tupaki Desk | 16 Oct 2017 3:57 AM GMTఆమె స్టార్ హీరోయినే అయ్యిండొచ్చు. సినిమాల్లో ఎన్నో భావోద్వేగ భరిత సన్నివేశాలను తన నటనతో రక్తి కట్టించి ఉండొచ్చు. గుండె లోతుల్లో ఉప్పొంగుతున్న ప్రేమను బయటపెట్టాల్సిన క్షణం వచ్చినప్పుడు మాత్రం తనూ ఓ అమ్మాయే. కోరుకున్న వాడి చేయి అందుకునే క్షణాన అందరిలాంటి అమ్మాయే.
టాలీవుడ్ లేటెస్ట్ కపుల్ సమంత - నాగ చైతన్యల వివాహం రీసెంట్ గా గోవాలో జరిగిందనే విషయం తెలిసిందే. హిందూ పద్ధతిలో ఒకసారి.. క్రిస్టియన్ పద్ధతిలో ఒకసారి ఈ జంట పెళ్లి చేసుకున్నారు. క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకునే సందర్భంగా చై చేతికి ఉంగరం తొడిగే ముందు సమంత తన మనసులోని మాట వినిపించింది. ‘‘నీ రాకతోనే నా జీవితం సంపూర్ణమైంది. మన సంతానానికి కచ్చితంగా నువ్వు మంచి తండ్రివి అవుతావు. నేను మరో వంద జన్మలెత్తినా... నాకు మరో వంద అవకాశాలు వచ్చినా నేను భర్తగా కోరుకునేది నిన్నే’’ అంటూ ఉద్వేగంతో చెప్పింది.
సమంత ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆమె గొంతు ఉద్వేగంతో నిండిపోయింది. తడిబారిన కళ్లతో ఆమె చెప్పిన ఈ మాటలు అందరినీ కదిలించివేసాయి. పెళ్లికి హాజరైన వారంతా వెంటనే తమ చప్పట్లతో కొత్త జంటకు అభినందనలు తెలిపారు.