Begin typing your search above and press return to search.
ఎంతైనా సమంత సమంతే..
By: Tupaki Desk | 30 Jun 2015 10:37 AM GMTఅందగత్తెలందరికీ అందమైన మనసుంటుందని అనుకోలేం. కోట్లు సంపాదిస్తుంటారు కానీ.. సమాజం కోసం అందులో కొన్ని లక్షలు, వేలు ఖర్చు చేయడానికి కూడా ముందుకు రారు కొందరు హీరోయిన్లు. కానీ సమంత అలా కాదు.. హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ సంపాదించిన వెంటనే తన సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వినియోగించాలని నిర్ణయించుకుంది. అనారోగ్యంతో బాధపడే చిన్నారులకు అండగా నిలుస్తున్న ప్రత్యూష ఫౌండేషన్‌కు భారీ మొత్తంలో ఆర్థిక సాయం చేస్తూ సపోర్ట్ ఇస్తోంది.
ప్రకృతి వైపరీత్యాలు జరిగినపుడు.. ఇంకెవరికైనా సాయం చేయాల్సి వచ్చినపుడు కూడా సమంత మిగతా హీరోయిన్ల కంటే ముందుంటుంది. తాజాగా సమంత తనలోని సేవాదృక్పథాన్ని మరోసారి చాటుకుంది. తమిళంలో ధనుష్ సరసన ఆమె నటిస్తున్న 'వీఐపీ-2' షూటింగ్ ముగింపు దశలో సినిమా కోసం పని చేసిన యూనిట్ సభ్యులందరికీ తలో ఐదు వేల చొప్పున గిఫ్ట్‌గా ఇచ్చింది సమంత. యూనిట్‌లో అంటే పది మందో ఇరవై మందో కాదు.. చాలా పెద్ద సంఖ్యలోనే పని చేశారట. వాళ్లందరికీ ఈ గిఫ్ట్ ఇచ్చింది సామ్స్. ఇందుకోసం ఆమెకు లక్షల్లోనే ఖర్చయింది. సమంత దానగుణం చూసి ధనుష్ కూడా ఫ్లాట్ అయిపోయి.. నీకు నువ్వే సాటి అని కితాబిచ్చాడట.