Begin typing your search above and press return to search.
సౌత్ లో ఆర్గంజా ట్రెండ్ మొదలు పెట్టిన సమంత
By: Tupaki Desk | 11 Feb 2020 11:45 AM GMTసెలబ్రెటీలు తమ డ్రస్ ల విషయంలో చాలా ట్రెండీగా ఉంటారు. కొత్త కొత్త డిజైన్స్ ను ట్రై చేస్తూ ఉంటారు. విభిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో చాలా ఎక్కువ ఖర్చు చేసి మరీ డిజైనర్ వెరైటీ కాస్ట్యూమ్స్ ను ట్రై చేస్తూ ఉంటారు. కాని కొందరు మాత్రం చాలా తెలివిగా పాత తరం స్టైల్.. ఎప్పుడో ఔట్ డేట్ అయిన స్టైల్ ను మళ్లీ అనుసరించి జనాల్లో ప్రత్యేకంగా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు హాట్ హీరోయిన్స్ అదే పని చేస్తున్నారు.
అప్పుడెప్పుడో ఔట్ డేట్ అయిన ఆర్గంజా చీరలు మరియు డ్రస్ లు మళ్లీ ఇప్పుడు ట్రై చేస్తున్నారు. పాత సినిమాల్లో హీరోయిన్స్ ఎక్కువగా ఆర్గంజా చీరల్లో కనిపించే వారు. ఆ తర్వాత కాలంలో ఆ చీరలు కనుమరుగయ్యాయి. మళ్లీ బాలీవుడ్ లో ఆ చీరల సందడి మొదలైంది. సమంత తాజాగా జాను సక్సెస్ వేడుకలో ఆర్గంజ చీరలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. చీరపై జాను అంటూ సినిమా టైటిల్ ఉండటం మరింతగా ఆకర్షించింది.
ఔట్ డేటెడ్ అయిన డిజైన్స్.. కాస్ట్యూమ్స్ ను మళ్లీ సమంత సౌత్ ఆడియన్స్ కు పరిచయం చేయడంతో మళ్లీ అవి ట్రెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెలబ్రెటీలు వాడి అవి ఫేమస్ అయితే మళ్లీ వాటికి మంచి రోజులు వచ్చినట్లే అంటారు. ఇప్పుడు ఆర్గంజాకు కూడా మంచి రోజులు వచ్చాయని.. సెలబ్రెటీలు మాత్రమే కాకుండా సామాన్య అమ్మాయిలు కూడా ఇకపై ఆర్గంజాను ట్రై చేస్తారని స్టైలిస్ట్ ల సోషల్ మీడియా టాక్.