Begin typing your search above and press return to search.
మళ్ళీ సమంతకు ఏమైంది?
By: Tupaki Desk | 11 April 2015 5:30 PM GMTఅనుకోకుండా హెల్త్‌ను పాడు చేసుకుంటూ ఉంటుంది హీరోయిన్ సమంత. అయితే గతంలో ఆమెకు తీవ్రంగా అనారోగ్యం చేయడంతో సీతమ్మ వాకిట్లో సినిమా షూటింగ్ చాలారోజులు పోస్ట్‌పోన్ చేశారు కూడా. ఆమెకు ఏమైందనే విషయం గురించి అమ్మడు ఎప్పుడూ చెప్పలేదు కాని, ఆ తరువాత మధ్యమధ్యలో చాలాసార్లు ''సిక్'' అంటూ చెబుతూనే ఉంది సమంత.
తాజాగా సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్ విచ్చేసింది సమంత. నేపాల్‌లో షూటింగ్ చేస్తూ సడన్‌గా అక్కడ లీవ్ పెట్టి మరీ ఇప్పుడు ప్రమోట్ చేయడానికి వచ్చింది అమ్మడు. మొన్న రిలీజ్ రోజుకు ఒక్కరోజు ముందు పొద్దునే బయలుదేరి మధ్యాహ్నానికి హైదరాబాద్ వచ్చి సాయిత్రానికి ఇంటర్యూల్లో బిజీ అయిపోయింది. ఇక ఈరోజు కూడా స్పెషల్ టీమ్ ఇంటర్యూల్లో బిజీగా గడిపింది అమ్మడు. కాని విషయం ఏంటంటే.. మళ్ళీ సమంతకు ఒంట్లో బాగాలేదట.
పొద్దున్నే హైదరాబాద్‌లో ఓ షాప్ ఓపెనింగ్‌లో పాలుపంచుకున్న సమంత, ఒంట్లో బాగాలేనప్పుడు వర్క్ చేయాలంటే పిచ్చిపిచ్చిగా ఉంటుందని సెలవిచ్చింది. అయినాసరే అభిమానులు కోసం కష్టపడి వస్తున్నా అంటోంది స్యామ్.