Begin typing your search above and press return to search.

వీడియో: కఠినమైన కసరత్తులు చేస్తున్న సామ్

By:  Tupaki Desk   |   26 Feb 2019 6:53 AM GMT
వీడియో: కఠినమైన కసరత్తులు చేస్తున్న సామ్
X
సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్ కదా. ఈమధ్య కాలం లో హీరోలే ఫిట్ గా ఉంటూ.. సిక్స్ ప్యాక్ లుక్స్ లో కనిపిస్తున్నారు. అలాంటప్పుడు హీరోయిన్ల మరింత ఎక్కువగా గ్లామర్ మీద ఫోకస్ చేయాలి కదా. దీంతో జిమ్ముకు వెళ్ళడం.. కసరత్తులు చేయడం చాలా కామన్. ఈ ఎక్సర్ సైజులు సాధారణంగా చేస్తే ఏం థ్రిల్ ఉంటుందని అనుకుందో ఏమోగానీ సమంతా మాత్రం కఠినమైన కసరత్తులను బాహుబలి రేంజ్ లో చేస్తోంది.

రీసెంట్ గా సమంతా జిమ్ లో ఫుల్ బరువున్న ప్లేట్స్ వేసుకొని స్క్వాట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నడుముకు సపోర్ట్ బెల్ట్ కట్టుకుని మరీ భారీ వెయిట్లు ఎత్తుతూ ఫిట్నెస్ విషయంలో తనకు ఎవరూ సాటిరారని నిరూపిస్తోంది. కాకపోతే వెయిట్ ఎత్తుతున్న సమయంలో ముక్కుతున్నట్టుగా ఒకలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. ఈ వీడియోకు నెటిజనులు ఫిదా అయిపోయారు. ఒకరు "ఓ మై గాడ్.. నువ్వు గ్రేట్. నేను ఒక్క బకెట్ నీళ్ళు కూడా ఎత్తలేను" అంటూ తన ఆశ్చర్యాన్ని ప్రకటించారు. మరొక సోంబేరి నెటిజన్ మాత్రం "ఎక్కువ తినడం ఎందుకు.. అరగడానికి అంత కష్టమైన కసరత్తులు చేయడం ఎందుకు" అంటూ తనదైన స్టైల్ లో చెప్పాడు.

ఈ ఎక్సర్ సైజుల సంగతి పక్కన పెడితే సమంతా ప్రస్తుతం 'మజిలీ'లోనూ.. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ సేతుపతి తమిళ సినిమా 'సూపర్ డీలక్స్' లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.