Begin typing your search above and press return to search.

జూన్ 2న ఫూల్‌ అయిపోతావ్‌ -సమంత

By:  Tupaki Desk   |   26 May 2016 11:46 AM GMT
జూన్ 2న ఫూల్‌ అయిపోతావ్‌ -సమంత
X
''సమంత దగ్గర నుండి 'అ..ఆ' రూపంలో మరో ఫ్లాప్ ఎక్సపెక్ట్ చేస్తున్నా'' అంటూ ఒక ట్విట్టర్‌ ఫాలోవర్‌ సమంతకు ట్వీట్ చేశాడు. దీనితో మనోడు బ్రహ్మోత్సవం రిజల్టు గురించి కామెంట్ చేశాడని అర్ధం చేసుకున్న సమంతకు.. వెంటనే చిర్రెత్తుకొచ్చింది. ఆమె ఏమని రిప్లయ్‌ ఇచ్చిందో తెలుసా?

''ఆల్రెడీ నువ్వు ఫూల్‌ కానట్లయితే.. జూన్ 2న సినిమా రిజల్టు చూశాక పెద్ద ఫూల్‌ అయిపోతావ్ అని నేను కూడా ఎక్సపెక్ట్‌ చేస్తున్నా'' అంటూ సమంత కాస్త గాట్టిగానే రిప్లయ్‌ ఇచ్చింది. అంటే సమంతకు త్రివిక్రమ్ డైరక్షన్ లో చేసిన ''అ..ఆ'' సినిమా మీద అంత నమ్మకం ఉందనమాట. అయితే మరీ ట్విట్టర్‌లో ఇంతవరకు బ్రహ్మోత్సవం సినిమా గురించి ఒక్క కామెంట్ కూడా చేయని సమంత.. సడన్‌ గా తన సైలెన్స్ ను బ్రేక్‌ చేసి విమర్శకులకు ఈ రేంజులో ఎందుకు రిప్లయ్‌ ఇచ్చిందో అర్ధం కాలేదు. కాకపోతే ఆమె 'అ..ఆ' సినిమాపై చాలా ఆశలు పెట్టుకుందని.. అందుకే ఇలా ఎమోషనల్ అయిపోతోందని మనం అర్ధం చేసుకోవచ్చు.

ఈ మధ్య కాలంలో 24 సినిమాలో ఆమె నటనకూ విమర్శలొచ్చాయి. బ్రహ్మోత్సవమూ దెబ్బేసింది. మరి 'అ..ఆ' సినిమాతో త్రివిక్రమ్ అండ్ నితిన్‌ లు కావల్సినంత రిలీఫ్‌ ఇస్తారా? లెటజ్ సీ.