Begin typing your search above and press return to search.
సామ్ కు సవాల్ ముందుంది
By: Tupaki Desk | 2 Nov 2018 11:29 AMఅక్కినేని కోడలయ్యాక కూడా స్పీడ్ తగ్గించకుండా వరసగా సినిమాలు చేస్తూనే ఉన్న సమంతా ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ మొత్తం హ్యాట్రిక్ సక్సెస్ లతో దుమ్ము దులిపేసింది. రంగస్థలం ఎప్పటికి మర్చిపోలేని ఇండస్ట్రీ హిట్ కాగా మహానటి అటు కమర్షియల్ హిట్ తో పాటు నటన పరంగా మంచి పేరు కూడా ఇచ్చింది. దానితో పాటు అదే సమయంలో విశాల్ తో చేసిన అభిమన్యుడు సైతం విజయాన్ని సాధించి హ్యాట్రిక్ పూర్తి చేసింది. కాని సెకండ్ హాఫ్ నుంచి సామ్ కు చుక్కెదురు స్టార్ట్ అయ్యింది.
తమిళ్ లో శివ కార్తికేయన్ తో మొదటిసారి నటించిన సీమ రాజా డిజాస్టర్ కాగా అదే రోజు రెండు బాషలలో ఎన్నో ఆశలు రిలీజ్ చేసిన యుటర్న్ కూడా టపా కట్టేసింది. నిజానికి సీమ రాజా మీద సామ్ కు చాలా హోప్స్ ఉండేవి. కాని అర్థం లేని కథతో మాస్ హీరోయిజం ని ఓవర్ గా ఎలివేట్ చేసిన తీరు అరవ ప్రేక్షకులకు సైతం నచ్చలేదు. ఈ సినిమా కోసమే సమంతా కర్రసాము నేర్చుకుని ఇందులో ఫైట్లు కూడా చేసింది. అంతే కాదు స్వంతంగా డబ్బింగ్ కూడా చెప్పింది. యుటర్న్ గురించి చెప్పాల్సిన పని లేదు. థ్రిల్లర్ గా తన భుజాల మీదే సినిమాను నడిపిస్తే పాజిటివ్ టాక్ వచ్చినా ప్రేక్షకులు నిలబెట్టలేకపోయారు.
ఇప్పుడు సామ్ కొత్త సినిమా సూపర్ డీలక్స్ విడుదలకు రెడీ అవుతోంది. విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ గా కొత్త తరహా పాత్ర పోషించిన ఈ మూవీలో సమంతాదే కీ రోల్. రమ్య కృష్ణ లాంటి సీనియర్ ఆర్టిస్టులు కూడా ఇందులో ఉన్నారు. కోలీవుడ్ లో దక్కిన రెండు చేదు అనుభవాల నుంచి ఇది బయటపడేస్తుందన్న నమ్మకంతో ఉంది సామ్. దీంతో పాటు భర్త నాగ చైతన్యతో కలిసి చేస్తున్న మజిలి(వర్కింగ్ టైటిల్)మాత్రమే సెట్స్ మీద ఉంది. ఇవి కాకుండా ఇంకే కొత్త సినిమా ఒప్పుకోలేదు సమంతా. ఆఫర్స్ వెల్లువలా వస్తున్నా నటనకు స్కోప్ ఇచ్చేవాటిని మాత్రమే ఒప్పుకుంటాను అని చెబుతోంది. సో హ్యాట్రిక్ హిట్స్ నుంచి ఫ్లాప్ ట్రాక్ లో పడ్డ సమంతాకు బ్రేక్ ఇవ్వాల్సింది సూపర్ డీలక్సే.