Begin typing your search above and press return to search.

కాజల్ పోస్టర్లతో సమంతకు కోపమొచ్చిందా?

By:  Tupaki Desk   |   6 Sep 2016 1:30 PM GMT
కాజల్ పోస్టర్లతో సమంతకు కోపమొచ్చిందా?
X
అదేంటోగాని.. సమంత చుట్టూ చాలా రూమర్లు తిరుగుతూనే ఉంటాయి. అమ్మడు వద్దని చెప్పినా కూడా.. రూమర్లు మాత్రం ఆగే ఛాన్సుండదు. అసలు సమంత 'జనతా గ్యారేజ్‌' ఆడియో రిలీజ్ కు రాకపోవడంతో.. అమ్మడికి సినిమాలో తనకు ఆఫర్ చేసిన పాత్ర పెద్దగా నచ్చలేదని చెప్పుకొచ్చారు రూమర్ రాయుళ్లు. ఆ తరువాత ఆమె ప్రమోషన్లకు రావడంతో ఈ రూమర్లు కాస్త సద్దుమణిగాయ్. ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయ్.

నిజానికి వినాయక చవితి సందర్భంగా ఇప్పుడు జనతా గ్యారేజ్ కీలక క్యాస్టింగా అంతా దర్శకుడు కొరటాల శివతో కలసి కొన్ని ఛానళ్ళలో ఇంటర్యూలు ఇచ్చారు. అయితే ఈ ఇంటర్యూలలో సమంత మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఒక ప్రక్కన సినిమా రిలీజ్ తరువాత వచ్చిన రివ్యూలలో అసలు సమంత ఇంత చిన్నపాత్ర ఎలా చేసింది అంటూ క్రిటిసిజం రావడం.. అలాగే సినిమా రిలీజయ్యాక కాజల్ ఐటెం సాంగుకు బాగా పేరు రావడంతో.. ఎన్టీఆర్-కాజల్ పోస్టర్లు ఎక్కువగా కనిపించడం.. సమంతను ఇంకా బాధకు గురిచేశాయట. కోపం వచ్చిందట అందుకే ఆమె పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లకు రావడంలేదని రూమర్లు వస్తున్నాయి.

మొత్తానికి సమంత ఎప్పుడు జనతా గ్యారేజ్ ప్రమోషన్లకు రాకపోయినా కూడా.. ఈవెంట్లకు రాకపోయినా కూడా.. అమ్మడు హర్టయ్యిందని చెప్పడం ఒక కామన్ విషయం అయిపోయింది. అయితే నిజానికి సమంత తన పెళ్ళి పనుల్లో బిజీగా ఉండటం వలనే టైమ్ కేటాయించలేకపోతోంది అనే మరో వాదన కూడా వినిపిస్తోందిలే.