Begin typing your search above and press return to search.

ఆవిడ చెయ్యేస్తే అసలావిడ అలిగిందా!

By:  Tupaki Desk   |   15 Jan 2020 6:35 AM GMT
ఆవిడ చెయ్యేస్తే అసలావిడ అలిగిందా!
X
యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌- సాయి ప‌ల్ల‌వి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రానికి `ల‌వ్ స్టోరీ` టైటిల్ ఖ‌రారు చేస్తూ సంక్రాంతి కానుక‌గా ఓ కొత్త పోస్ట‌ర్ ని రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. పోస్ట‌ర్ లో చైపై సాయి ప‌ల్ల‌వి ఘాటైన స‌ర‌స‌న యూత్ కి ఇట్టే క‌నెక్ట‌యిపోతోంది. చైతూ ష‌ర్ట్ ప‌ట్టుకుని త‌న‌వైపు ద‌గ్గ‌ర‌గా లాక్కుని త‌మ‌కంగా త‌థేకంగా ప్రేమ‌ని వ్యక్త‌ప‌రుస్తూ భావోద్వేగానికి గుర‌వుతోంది సాయి ప‌ల్ల‌వి. టైటిల్ పోస్ట‌ర్ ని బ‌ట్టి క‌మ్ముల ఓ బ్యూటిఫుల్ ల‌వ్ స్టోరీని తెర‌కెక్కిస్తున్నార‌ని క్లారిటీ వ‌చ్చేసింది. త‌న‌దైన శైలి సున్నిత‌మైన‌ ఎమోష‌న్స్ ని జోడించి ఉద్విగ్న‌భ‌రిత‌మైన అంద‌మైన ల‌వ్ స్టోరీతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి రెడీ అవుతున్నారని అర్థ‌మ‌వుతోంది.

మ‌రి చైతూతో సాయి ప‌ల్ల‌వి వ్య‌వ‌హారం సామ్ కి న‌చ్చ‌లేదా? అంటే అవున‌నే తాజా సీన్ చెబుతోంది. ఈ పోస్ట‌ర్ పై చై స‌తీమ‌ణి స‌మంత అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది మ‌రి. నా భ‌ర్త ష‌ర్ట్ పట్టుకోవ‌డానికి నువ్వె ఎవ‌రు అన్నంతగా ఫీలైంది. చై ష‌ర్ట్ పై ఆ చేతిని తీసేయ్ అంటూ సాయిప‌ల్ల‌విని సుతి మెత్త‌గా కోరింది స‌మంత‌. ఆ మేర‌కు సోష‌ల్ మీడియాల్లో నెటిజ‌నులు ఓ సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. సమంత నిజంగా ఫీలై అలా అందా? క‌్యాజువ‌ల్ గానే అలా కామెంట్ చేసిందా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. సినిమాల్లో పెళ్లైన హీరోల భార్య‌ల‌ను..మ‌రోక హీరో సీన్ డిమాండ్ మేర‌కు ముద్దులతో ముంచెత్త‌డం చూస్తున్న‌దే.

అవ‌స‌రం మేర రొమాంటిక్ స‌న్నివేశాల్లో న‌టిస్తుంటారు. కానీ ల‌వ్ స్టోరీ లో అలాంటి సీన్ లేకున్నా..కేవ‌లం చై ష‌ర్ట్ గుజ్జినందుకే స‌మంత ఇంత‌గా రియాక్ట్ అవ్వాలా? అంటూ ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇక పోస్ట‌ర్ పై మీమ్స్ ర‌చ్చ మామూలుగా జ‌ర‌గ‌లేదు. జులాయి సినిమాలో బ్ర‌హ్మానందం పోస్ట‌ర్ ని ఎంచుకుని దానిపై ``వ‌దులు షర్ట్ వ‌దులు`` అంటూ కామెంట్లు పెట్టి వైర‌ల్ చేస్తున్నారు. స‌మంత ష‌ర్ట్ వ‌ద‌ల‌మ‌ని కోర‌డంతో ఆ ర‌చ్చ మ‌రింత ముదురుతోంది. మొత్తానికి సామ్ స్పంద‌న‌కు రిప్ల‌య్ లు ల‌వ్ స్టోరీకి ప్ర‌చారం ప‌రంగా మైలేజ్ పెంచుతున్నాయి. సామ్ కి కావాల్సింది కూడా అదేనేమో!