Begin typing your search above and press return to search.
సెట్ చూసి సంతోషపడిన సమంత
By: Tupaki Desk | 7 Nov 2017 6:03 AM GMTటాలీవుడ్లో ప్రస్తుతం ఎన్ని సినిమాలు తెరకెక్కుతున్న పూర్తిగా కొత్తదనంతో వస్తోన్న చిత్రం ఏదైనా ఉందా అని అంటే అది ఒక్క రంగస్థలం 1985 అనే చెప్పాలి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మొన్నటి వరకు సినిమా గురించి ఏమో అనుకున్నాం గాని ఇప్పుడు సెట్స్ లోని ఫొటోలు కొన్ని చూస్తుంటే సినిమా మళ్లీ మనల్ని 1980 లోకి తీసుకెళ్లేలా ఉందని అనిపిస్తోంది.
స్టార్ హీరో రామ్ చరణ్ లుక్ కూడా చాలా ప్రయోగాత్మకంగా ఉంది. సినిమాలో పూర్తిగా ఎలా కనిపిస్తాడా అని అందరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ఒక సెట్ చిత్ర యూనిట్ ని చాలా ఆకట్టుకుంటోంది. మొన్న రామ్ చరణ్ ఆ సెట్ లోని కొన్ని పోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులు చూపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు హీరోయిన్ సమంత కూడా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మరొక ఫొటోని చూపించింది. సెట్ చాలా బావుంది. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అంటూ.. ఈ సినిమాలో తాను ఒక భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. అయితే తన పెళ్ళి రిసెప్షన్ తరువాత సమంత సెట్స్ కు వస్తుందని అనుకుంటే.. ముందే వచ్చి అందరికీ షాకిచ్చిందనే చెప్పాలి.
ఈ సినిమాలో సుకుమార్ తన జీవితంలోని కొన్ని జ్ఞాపకాలను రంగస్థలంలో చూపించబోతున్నాడట. ఆర్ట్ డైరెక్టర్ శివమ్ రావ్ వేసిన సెట్స్ సినిమాకు చాలా ప్లస్ అవుతాయని చిత్ర యూనిట్ చాలా నమ్మకంతో ఉంది. మరి ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.