Begin typing your search above and press return to search.

అ..ఆ.. గ్లామర్ స్ర్టోక్‌ ఇచ్చేస్తోందంతే

By:  Tupaki Desk   |   26 May 2016 10:24 AM IST
అ..ఆ.. గ్లామర్ స్ర్టోక్‌ ఇచ్చేస్తోందంతే
X
వరుసగా మూడు సినిమాలు రిలీజ్ అవుతండటంతో.. దాదాపు చాలాసార్లు మీడియా ముందుకు వచ్చేసింది సమంత. ఈ నెల మొదట్లో 24 సినిమా విడుదలకు గాను ప్రమోషన్లు చేపట్టింది. ఆ తరువాత బ్రహ్మోత్సవం సినిమా ప్రమోషన్లలో తలమునకలైంది. ఇప్పుడేమో అ..ఆ సినిమా కోసం ప్రచార కార్యక్రమాలు మొదలెట్టేసింది మనం చెన్నయ్ చంద్రం.

ఈ మధ్య కాలంలో సమంత ప్రమోషన్ లో గ్లామర్‌ డోస్‌ తగ్గించింది. గతంలో కిక్ యాస్‌ గ్లామరస్ అవతార్ లో అమ్మడు ఉర్రూతలూగించేది. కాని బ్రహ్మోత్సవం కోసం చాలా కనజ్వర్వేటివ్ దుస్తుల్లో సందడి చేసింది. అయితే అ..ఆ సినిమా కోసం మాత్రం ఫుల్‌ పోష్‌ గానే వస్తోంది. అదిగో చూశారుగా.. పిక్కలు కనిపించేలా డిజైనర్ దుస్తుల్లో నిన్నంతా తెగ హల్ చల్‌ చేసింది అమ్మడు. మరో నాలుగు రోజులు కూడా ఇదే పని మన బంగారానికి.

ఇలా ప్రతీ ప్రమోషనల్‌ ఈవెంటుకూ సమంతను రెడీ చేసేది డిజైనర్ కమ్ స్టయిలిష్ట్ నీరజా కోన అని వేరే చెప్పక్కర్లేదు. ఆమె సహాయంతో ఈమె హాటుగా చంపేస్తోంది బాబా. గ్లామర్‌ స్ర్టోక్ తగిలేలా ఉంది చూసినోళ్లకు.