Begin typing your search above and press return to search.
అమ్మవారి గుడిలో సమంత.. ప్రమోషన్స్ షురూ
By: Tupaki Desk | 15 March 2023 5:07 PM GMTసమంత ఆరోగ్యం కుదుట పడింది. మయోసైటిస్ కారణంగా చాలా నెలలు కనీసం బయట కూడా కనిపించని సమంత ఎట్టకేలకు అభిమానుల ముందుకు వచ్చింది. హిందీలో ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో కూడా పాల్గొంది. అంతే కాకుండా శాకుంతలం సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా సమంత పాల్గొంటూ మీడియా ముందు మరోసారి సందడి చేసింది.
ఏప్రిల్ 14వ తారీకున సినిమా ఉందా లేదా అనే అనుమానంకు తెర దించుతూ దర్శకుడు గుణశేఖర్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టాడు.
సరిగ్గా నెల రోజుల సమయం ఉండగా ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టడం జరిగింది. హైదరాబాద్ పెద్దమ్మతల్లి అమ్మవారి దేవాలయంలో చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శాకుంతలం హీరోయిన్ సమంత.. హీరో దేవ్ మోహన్ తో పాటు దర్శక నిర్మాత గుణశేఖర్ ఇతర యూనిట్ సభ్యులు అమ్మవారి దేవాలయం వద్ద సందడి చేశారు.
మీడియా ముందు ఫొటోలకు ఫోజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సమంత యొక్క కొత్త లుక్ అంటూ అభిమానులు ఈ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా తెగ షేర్ చేస్తున్నారు.
దిల్ రాజు సమర్పిస్తున్న శాకుంతలం సినిమా విడుదల తేదీ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేసేందుకు తేదీని ప్రకటించి వాయిదా వేయడం జరిగింది. ఏప్రిల్ లో కూడా సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవ్వగా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసి రిలీజ్ పక్కా అన్నట్లుగా ప్రకటించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.