Begin typing your search above and press return to search.
వీడియో టాక్: సమంత కెమిస్ట్రీ అదుర్స్
By: Tupaki Desk | 15 Feb 2018 2:19 PM GMTఇండస్ట్రీ కి ఎంటర్ అయ్యి ఎన్ని సంవత్సరాలు గడిచిన, సమంత ఏ సినిమాలో అయిన చాలా కొత్తగా కనిపిస్తుంది అనటం వాస్తవమే. అది ఆమె నటన వల్ల మాత్రమే కాదు ఆమె ఎంచుకునే పాత్రలు కూడా దానికి కారణమే. అది ఏ పాత్ర అయినా సమంత కూడా తన 100 శాతం పెట్టేస్తోంది అనుకొండి. తెలుగు లోను తమిళ్ లోను వరస విజయలతో దూసుకుపోతున్న సమంత ఇపుడు ఒక రాబోతున్న సినిమా తో మనల్ని అబ్బురపరుస్తోంది.
విశాల్ తో తొలిసారిగా సమంత జత కట్టబోతోంది. తమిళ్ లొనే కాకుండా తెలుగులో కూడా డబ్బింగ్ చేసి అభిమన్యుడు అనే పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా త్వరలో మన ముందుకు రాబోతుండగా, ఇపుడు ఒక సాంగ్ ప్రోమో ను విడుదల చేసారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ మరియు టీజర్ తో అంచనాలను పెంచేసిన ఈ చిత్ర యూనిట్ సాంగ్ ప్రోమో తో మరింత ఉరిస్తోంది. ఇందులో సమంత మరియు విశాల్ మధ్య కెమిస్ట్రీ ఏదైతే ఉందొ అది అద్భుతం అనుకోండి. సినిమా మొత్తం మీద వాళ్లిద్దరి రొమాన్స్ హై లైట్ అవుతుంది అని మనం ఈజీ గా చెప్పేయచ్చు. తన నటనా, నవ్వు, కళ్ళు, డ్రెస్సింగ్ స్టైల్ తో సినిమా లో విశాల్ ని డొమినేట్ చేసేస్తోంది సమంత. ఆమె హావభావాలు ఇంకా ఏ హీరోయిన్ లోను చూడలేం అంటూ ఫాన్స్ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఈ సినిమా లో సీనియర్ నటుడు అర్జున్ ముఖ్య పాత్ర లో కనపడబోతున్నారు. సాంగ్ ప్రోమో వీడియో రిలీజ్ అయిన కొద్దీ సమయంలోనే వైరల్ అయ్యింది. సినిమా పై అంచనాలను ఒక రేంజ్ కు తీసుకువెళ్ళింది. మొత్తానికి సమంత తన అందం మరియు నటన తో నాగ చైతన్య తోనే కాదు ఫాన్స్ అందరితో కూడా ఎం మాయ చేసావే అనిపిస్తోంది.