Begin typing your search above and press return to search.
మెగా 152లో సమంత..!
By: Tupaki Desk | 10 Feb 2020 11:40 AM GMTమెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. మ్యాట్నీ మూవీస్ తో కలిసి చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మించడం మాత్రమే కాకుండా చరణ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా గత కొంత కాలంగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలను యూనిట్ సభ్యులు కనీసం కొట్టి పారేయక పోవడంతో మెగా 152లో చరణ్ కన్ఫర్మ్ అంటూ అంతా అనుకుంటున్నారు.
ఇక ఇదే సినిమాలో సమంత కూడా నటించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. కాని సమంత నటించేది చిరంజీవికి జోడీగా కాదు.. రామ్ చరణ్ కు జోడీగా అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రంగస్థలం చిత్రంతో వీరిద్దరి జోడీకి మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. అందుకే మరోసారి వీరిద్దరిని కలిపి చూపించడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించడంతో పాటు.. సినిమాకు మంచి బిజినెస్ అవుతుందనే ఉద్దేశ్యంతో కొరటాల శివ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
మెగా 152లో చరణ్ కనిపించేది అటు ఇటుగా అర్థ గంట పాత్ర. ఆ సమయంలోనే ఒక ఫైట్ మరియు ఒక పాట ఉంటుందట. డ్యూయెట్ కాదులే కాని ఆ సమయంలో చరణ్ కు పక్కన హీరోయిన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. సమంత స్క్రీన్ ప్రజెన్స్ పది నుండి పదిహేను నిమిషాలు మాత్రమే ఉంటుందని.. అయితే అందుకు ఆమె ఒప్పుకుంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
సమంతతో చర్చలు జరిపేందుకు కొరటాల శివ టీం రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. సమంత నో చెప్తే మరో ఇద్దరు హీరోయిన్స్ ను సంప్రదించేందుకు ఇప్పటికే ఖరారు చేసి పెట్టుకున్నారట. మెగాస్టార్ మూవీ అవ్వడంతో సమంత చిన్న పాత్ర అయినా ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది. మరి సమంత నిర్ణయం ఏంటో చూడాలి.