Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: చేనేత చీరలో అందాల చిన్నది

By:  Tupaki Desk   |   27 March 2017 6:01 AM GMT
ఫోటో స్టోరి: చేనేత చీరలో అందాల చిన్నది
X
టాప్ హీరోయిన్ సమంత ఇప్పుడు తదుపరి రాజు గారి గది సినిమాలో మెరవనుంది. ఆ సినిమా తరువాత తొలిసారిగా రామ్ చరణ్‌ తో సుకుమార్ డైరక్షన్లో వచ్చే సినిమాలో చేస్తోంది. అయితే బయట ఏదైనా కార్యక్రమానికి వచ్చే స్యామ్.. ఎప్పుడూ తన ఫ్యాషన్ తో మంటలు పుట్టిస్తుంది. కాని ఇప్పుడు మాత్రం రూటు మార్చేసింది.

నిజానికి సమంత అంటేనే మోడ్రన్ బట్టలకు కేరాఫ్‌ అడ్రస్ అని ఉండేది. ఆమె టాలీవుడ్ కు ఒక సోనమ్ కపూర్ తరహాలో ఫ్యాషనిష్టాగా వ్యవహరించేది. కాని ఎప్పుడైతే ఆమె తెలంగాణ రాష్ట్ర చేనేత అంబాసిడర్ గా ఎంపిక చేయబడిందో.. అప్పటినుండి అమ్మడు పెద్ద పెద్ద ఈవెంట్లకు చేనేతలోనే ఎంట్రీ ఇస్తోంది. అదిగో నిన్న జరిగిన ఒక కాలేజీ కార్యక్రమానికి కూడా నేత నేచిన చీరలోనే ఈ అందాల చిన్నది ముస్తాబైంది.

నల్లటి చేనేత చీరలో ఒక స్టార్ హీరోయిన్ ఎలా ఉంటుందో అంటూ కంగారుపడిన వారికి అమ్మడు తన వయ్యారల వడ్డనతో మతిపోగొట్టేసింది. చేనేతలో కూడా ఇంత అందంగా కనపించవచ్చా అంటూ నిరూపించి.. చేనేతకు నిజంగానే వన్నె తెచ్చేసింది అక్కినేని వారి కోడలు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/